కొర‌టాలా మాజాకా.. బ‌న్నీ సినిమాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్..!!

May 25, 2020 at 8:26 am

కొరటాల శివ.. వరుస హిట్లతో అనతికాలంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన ఈయ‌న‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిర్చి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఈ తరువాత మ‌హేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్, మ‌ళ్లీ మ‌హేష్ బాబుతో భరత్‌ అనే నేను ఇలా స్టార్ హీరోల‌తో జ‌త క‌ట్టి వ‌రుస హిట్లు ఖాతాలో వేసుకున్నాడు కొర‌టాల‌‌. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల చెంత చేరాడీయ‌న‌. ఇక ప్ర‌స్తుతం కొర‌టాల.. మెగాస్టార్ చిరంజీవితో ఆచ‌ర్య సినిమా చేస్తున్నారు.

ఇక‌ ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల ఏ హీరోను ఎంచుకుంటాడు అన్న‌ది హాట్ టాపిక్ అయింది. అయితే ఆచార్య తరువాత కొరటాల, బన్నీతో సినిమా తీయబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్‌ నడుస్తోంది. వాస్త‌వానికి నా పేరు సూర్య సినిమా రిలీజ్ తరువాత బన్నీ.. కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ, అప్పుడు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలని అల్లు అరవింద్, కొరటాలను కోరారట.

అందుకోసం ఆయన రూ.13కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. ఇక మరోవైపు బన్నీతో సినిమాను తీయాలనుకుంటున్న కొరటాల, బన్నీకి ఇప్పటికే కథను కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి కాంబోలో ఓ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో ఫిక్స్‌ అయినట్లే అని అంటున్నారు.

కొర‌టాలా మాజాకా.. బ‌న్నీ సినిమాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts