కృష్ణా జిల్లాలో ఘోరం…ప్రేమించిన ప్రియుడిని క‌త్తితో పొడిచి చివ‌రికి తాను ఏం చేసిందంటే?

May 26, 2020 at 9:44 am

ఒక‌రినొక‌రు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామ‌నుకున్నారు. అయితే ఎందువ‌ల్ల‌నో ఆ అబ్బాయి పెళ్ళికి తిర‌స్క‌రించ‌డంతో ఆ యువ‌తి ఎంత ప‌ని చేసిందంటే…క‌నీసం చావులోనైనా క‌లిసుందామ‌నుకుంది. దాంతో ఆవేశంలో ఎంత ప‌ని చెయ్య‌డానికి వెన‌కాడ‌లేదు. నేటి యువ‌త‌లో కాస్త ఆవేశం ఎక్కువ ఆలోచ‌న త‌క్కువ దాంతో ఎలాంటి ప‌ని చెయ్య‌డానికి వెన‌కాడ‌డం లేదు. ఆఖ‌రికి ప్రాణాలు తియ్య‌డానికైనా త‌మ ప్రాణాల‌ను వ‌దిలెయ్య‌డానికైనా. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.

బందరు ఇంగ్లీషుపాలెంలో నాగలక్ష్మి, గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్‌కుమార్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాగలక్ష్మి బందరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండగా, పవన్‌కుమార్‌ పెడన తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్ద‌రూ గ‌త రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరు క‌లిసి ఓ ఇటిని కూడా చల్లపల్లిలో అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఆ ఇంటి వద్ద యువకుడు కత్తిపోట్లకు గురై ఉండడం, యువతి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో కనిపించడంతో స్థానికంగా అక్క‌డంతా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. దాంతో ఇది గ‌మ‌నించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి, యువకుడిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంత‌రం తేరుకున్న పవన్‌కుమార్ నుంచి పోలీసులు స‌మాచారాన్ని తీసుకున్నారు. కొన్నాళ్లుగా నాగలక్ష్మి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకురావ‌డంతో తాను తిరస్కరిస్తూ వస్తున్నానని తెలిపాడు.

ఇక‌ చివరిసారిగా కలసి మాట్లాడుకుందామని ఆమె పిల‌వ‌గా సోమవారం ఉదయం ఆ రూమ్‌కి వచ్చినట్లు తెలిపాడు. పెళ్లి చేసుకొని ఇద్దరం కలసి బతుకుదాం లేదంటే కలసి చనిపోదామని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో నాగలక్ష్మి తనపై కత్తితో దాడి చేసింద‌ని అంతేకాక‌ తాను కూడా నిద్రమాత్రలు మింగిందని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కృష్ణా జిల్లాలో ఘోరం…ప్రేమించిన ప్రియుడిని క‌త్తితో పొడిచి చివ‌రికి తాను ఏం చేసిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts