ఏపీలో భారీగా ప‌డిపోయిన మ‌ద్యం అమ్మ‌కాలు.. అందుకేనా..?

May 11, 2020 at 8:11 am

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌పంచ‌దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దేశ‌దేశాలు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. దీంతో ప‌లు దేశాలు ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్‌. ఈ లాక్‌డౌన్ కార‌ణంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా.. మిగిలిన అన్ని వ్యాపారాల‌తో పాటు మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. ఎప్పుడు కిక్కులో ఉంటే మందుబాబులు చుక్క మందు కూడా దొర‌క్క పిచ్చెక్కిపోయారు. అటు ప్ర‌భుత్వాల ఆధాయం కూడా భారీగా ప‌డింది.

ఈ క్ర‌మంలోనే మూడో ద‌శ లాక్‌డౌన్‌లో కేంద్రం మ‌ద్యం షాపుల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇక కేంద్రం అనుమ‌తించ‌డంతో.. ప‌లు రాష్ట్రాల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ లిక్క‌ర్ షాపులు గ‌త వారం నుంచి తెరుచుకున్నాయి. దాదాపు నలబై రోజుల తర్వాత షాపులు తీయడంతో.. మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మద్యం ప్రియులు ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం దుకాణాల‌ ముందు ఎగబడ్డారు. భారీగా ధ‌ర‌లు పెంచినప్పటికీ.. అవేమి లెక్క‌చెయ్య‌కుండా మందుబాబులు ఎగబడి మరీ మద్యాన్ని కొన్నారు.

అయితే శనివారం వరకు ఈ మ‌ద్యం అమ్మకాలు జోరుగానే ఉండగా.. ఆదివారం మాత్రం భారీగా తగ్గిపోయాయి. మద్యం ధరలను 75శాతం పెంచడంతో పాటు.. దుకాణాల సంఖ్యను 13శాతం తగ్గించడంతో లిక్కర్ అమ్మకాలు తగ్గినట్లు విశ్లేష‌కులు అంటున్నారు. కాగా, మే 4న మద్యం విక్రయాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి దాదాపుగా రూ.70కోట్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక మే 9న రూ.40.77 కోట్ల మ‌ద్యం అమ్మకాలు జ‌రిగిన‌ట్టు స‌మాచారం. దీనిని బ‌ట్టీ చూస్తుతంటే.. నాలుగు రోజుల్లోనే ఏపీలో రూ. 30 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు తగ్గిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

ఏపీలో భారీగా ప‌డిపోయిన మ‌ద్యం అమ్మ‌కాలు.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts