తెలంగాణలో నేటి నుంచి మరిన్ని సడలింపులు..!!

May 16, 2020 at 7:38 am

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌పై దాడి చేసి నెల‌లు గ‌డుస్తున్నా.. దీని దూకుడు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక క‌రోనా వైర‌స్ తెలంగాణ‌లోనూ నెమ్మ‌దిగా పెరుగుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 1,454 పాజిటివ్ కేసులు ఉండ‌గా.. క‌రోనా కాటుకు బ‌లైన వారి సంఖ్య 34కు చేరుకుంది. అయితే ఇక్క‌డ ప్ర‌స్తుతం క‌రోనాని క‌ట్ట‌డి చేసేందుకు మూడో ద‌శ‌ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటో మొబైల్ షో రూములు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నెల్‌ ఇస్తున్నట్లు కేసీఆర్ స‌ర్కార్‌ ప్రకటించారు. ప్ర‌స్తుతం‌ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ఆర్టీఏ కార్యాలయాలు నడుస్తాయని తెలిపిన కేసీఆర్.. మిగతా లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలవుతాయని స్ప‌ష్టం చేశారు.

ఇక మరిన్ని తెరిచే విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల్ని బట్టీ తాము నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. మే 17తో మూడో లాక్‌డౌన్ ముగుస్తుంది కాబట్టి… రేపు కేంద్రం విడుదల చేసే కొత్త మార్గదర్శకాల్ని లెక్కలోకి తీసుకొని… సోమవారం నుంచి వేటికి వెసులుబాట్లు కల్పించాలో కేసీఆర్ నిర్ణయించనున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం హైదరాబాదులోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో కరోనా కేసుల్లేవని అన్నారు. ఎల్బీ నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ ప్రాంతాల్లోనే యాక్టివ్ కేసులు ఉన్నాయని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణలో నేటి నుంచి మరిన్ని సడలింపులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts