ఆ 13 న‌గ‌రాల్లో మాత్ర‌మే లాక్‌డౌన్ కొనసాగింపు.. రేపే మోడీ క్లారిటీ..!!

May 30, 2020 at 11:07 am

క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే భ‌యం ప్ర‌జ‌ల‌ను వెంటాడుతోంది. ఎక్క‌డ‌.. ఎప్పుడు.. ఎటునుంచి వ‌చ్చి క‌రోనా ప‌ట్టేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు ప్రాణాల‌ను గుప్పెట్లో పెట్టుకుని బ‌తుకుతున్నారు. అంత‌లా ఈ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. ఇదివరకు ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. వినలేదు. మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది. కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు. ఈ క్ర‌మంలోనే కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం ఐదు నెలలుగా సాగుతోంది. ఇక మ‌రోవైపు భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది.

లాక్‌డౌన్ వల్ల కరోనా కట్టడి అయిందని భావిస్తున్నప్పటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ భారత్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో మే 31తో లాక్‌డౌన్‌ను ముగించాలన్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే, కేసులు ఉద్ధృతంగా ఉన్న నగరాలు మినహా మిగతా చోట్ల లాక్‌డౌన్ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు సమాచారం.

ఇక‌ లాక్‌డౌన్ కొనసాగించే నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణె, హైదరాబాద్, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్‌పట్టు, తిరువల్లూరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నగరాల్లో మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశలున్నాయని చెబుతున్నారు. అలాగే జూన్ ఒకటో తేదీ నుంచి హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, అది దశలవారీగానే ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజం ఉంది అన్న‌ది రేపు ప్రధాని ‘మన్ కీ బాత్’లో తెలియాల్సి ఉంది.

ఆ 13 న‌గ‌రాల్లో మాత్ర‌మే లాక్‌డౌన్ కొనసాగింపు.. రేపే మోడీ క్లారిటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts