క్వారంటైన్ కేంద్రంలో ప్రేమజంట పెళ్లి.. బంధువులుగా మారిన ఇన్‌చార్జీలు

May 28, 2020 at 10:43 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ఈ క‌రోనా భూతాన్ని క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌భుత్వాల‌కు క‌త్తి మీద సాములా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ప్రేమ‌జంట క్వారంటైన్ కేంద్రంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ అరుదైన ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పూరి జిల్లా సాగాడ గ్రామానికి చెందిన సౌరబ్ దాస్ అనే 19 ఏళ్ల యువకుడు. సౌరబ్ దాస్ అదే గ్రామానికి చెందిన పింకీరాణిని ప్రేమిస్తున్నాడు. సౌరబ్ తన ప్రేయసి పింకీరాణిని తీసుకొని ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి పారిపోయాడు. అక్కడే ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఆమెతో సహజీవనం కొనసాగించాడు. ఇక‌ ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమ మూసివేయడంతో తిరిగి సొంత గ్రామానికి వచ్చారు.

అయితే, వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశారు. కానీ, నెగిటివ్‌గా తేలినప్పటికీ 14 రోజుల పాటు అధికారులు వారిని క్వారంటైన్‌లో ఉంచారు. అప్పటికే పింకీరాణి గర్భవతి అని అధికారులు తెలుసుకున్నారు. క్వారంటైన్ సమయం ముగియడంతో అందులోనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. క్వారంటైన్‌ కేంద్రంలో ఇన్‌చార్జీలుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులుగా దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ జంట ఇంటికి వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది.

క్వారంటైన్ కేంద్రంలో ప్రేమజంట పెళ్లి.. బంధువులుగా మారిన ఇన్‌చార్జీలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts