రాజ‌మౌళి సినిమాలో రాముడిగా మ‌హేష్ బాబు.. వైర‌ల్ ఫోటో..!!

May 27, 2020 at 10:29 am

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ కళ్లు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశ‌ల‌ను నిజం చేస్తూ.. ఇటీవ‌ల రాజ‌మౌళి మ‌హేష్‌తో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. సినిమా ఎలా ఉండబోతోంది ? ఎప్పుడు మొదలవుతుందనే విషయాలు చెప్పకపోయినా… మహేశ్ బాబుతోనే తన నెక్ట్స్ మూవీ అన్న క్లారిటీ అయితే ఇచ్చేశాడు రాజ‌మౌళి.

అలాగే ఈ సినిమా జాన‌ర్ ఏంట‌నేది రాజ‌మౌళి స్ప‌ష్టం చేయ‌క‌పోవ‌డంతో మైథ‌లాజిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా ఉంటుంద‌ని మ‌హేష్ ఫ్యాన్స్ త‌మ క్రియేటివిటీని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌హేష్‌ని రాముడి గెట‌ప్‌లో చూపిస్తూ ఆయ‌న అభిమాని ఓ ఫొటోని వ‌దిలారు. శివ‌ధ‌నుస్సుని ప‌ట్టుకుని ఆరు ప‌ల‌క‌ల దేహంతో కూల్‌గా మహేష్‌ బాబు క‌నిపిస్తున్నాడు. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు లార్డ్ రామ అంటూ ఆ ఫొటోకి క్యాప్ష‌న్ కూడా ఇవ్వ‌డంతో రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రామాయ‌ణం నేప‌థ్యంలో ఉంటుందా? అన్న చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

మ‌రోవైపు మ‌హేష్‌తో జ‌క్క‌న్న క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ డ్రామాని ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం రాముడి గెట‌ప్‌లో ఉన్న మ‌హేష్ బాబు ఫోటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేష్‌ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్న సంగ‌తి తెలిసిందే.

రాజ‌మౌళి సినిమాలో రాముడిగా మ‌హేష్ బాబు.. వైర‌ల్ ఫోటో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts