`నువ్వా హైట్.. నేనా`.. కుమారుడితో మ‌హేష్ ప‌న్నీ వీడియో..!!

May 23, 2020 at 11:05 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. దీంతో క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. అంత‌లా ఈ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని పొట్ట‌న‌పెట్టుకున్న క‌రోనా.. ఇంకెంత మందిని బ‌లితీసుకుంటుందో అర్థంకాని ప‌రిస్థితి. మ‌రోవైపు క‌రోనా కంటికి క‌నిపించ‌క‌పోయినా.. ప్ర‌పంచ‌దేశాలు ఈ మ‌హ‌మ్మారిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.

ఈ లాక్‌డౌన్ కార‌ణంగా సామాన్యుడి ద‌గ్గ‌ర నుంచి సెల‌బ్రెటీ వ‌ర‌కు అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు గత రెండు నెలలుగా భార్య‌, పిల్ల‌ల‌తో సూప‌ర్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. తన పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ, స్విమ్మింగ్ చేసుకుంటూ కనిపిస్తున్న మహేశ్ ఇంటి దగ్గర సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక వారికి సంబంధించిన క్యూట్ మూవ్ మెంట్స్ ను ఎప్పటికప్పుడు వీడియోలో బంధించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు నమ్రత, మహేష్.

అలాగే ఇప్పటి వరకూ పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. తాజాగా తన కుమారుడి ముందు నిలబడి ఎవరు హైట్‌గా ఉన్నారో చూసుకున్నాడు. ఆ సమయంలో గౌతం చిరునవ్వులు చిందించాడు. సితార కూడా అక్కడే ఉంది. ఇందుకు సంబంధించి వీడియోను మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే హైట్‌ చెక్ చేసుకున్నాం అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రి ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

 

View this post on Instagram

 

Height check!! He’s tall♥️♥️ #LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

`నువ్వా హైట్.. నేనా`.. కుమారుడితో మ‌హేష్ ప‌న్నీ వీడియో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts