ఎప్పుడు చూడ‌ని మ‌హేష్ వ‌ర్క్ అవుట్‌.. వైర‌ల్ వీడియో..!!

May 28, 2020 at 8:35 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఇటీవ‌ల `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. అయితే, లాక్ డౌన్ తో షూటింగులు ఆగడంతో ఇది ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 31న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అలాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం మహేశ్ బాబు ఇంట్లోనే ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో తీసుకున్న ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరించాయి.

అయితే తాజాగా మహేష్‌ రన్నింగ్ మిషీన్‌పై వర్కౌట్ చేస్తూ కనిపించాడు. మహేశ్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రాంలో మహేశ్ రన్నింగ్ వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ.. ఇది మహేష్‌‌కి డైలీ డోస్ అని చెప్పుకొచ్చింది. అయితే రన్నింగ్ మెషిన్‌పై మహేష్‌ పరుగెడుతున్న స్టైల్ అదిరిపోవడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్త‌వానికి మ‌హేష్ వ‌ర్క్ అవుట్స్ చేస్తూ ఎప్పుడూ క‌నిపించ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో మ‌రింత వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

Running to perfection ♥️♥️♥️ daily dose of exercise!! @urstrulymahesh #StayHome #StayFit #Lockdowndiaries

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

ఎప్పుడు చూడ‌ని మ‌హేష్ వ‌ర్క్ అవుట్‌.. వైర‌ల్ వీడియో..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts