#SSMB27 `సర్కారు వారి పాట`.. మ‌ళ్లీ మహేష్ రాజకీయం మొదలైందా..?

May 31, 2020 at 9:51 am

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. దాదాపు నాలుగున్నర నెలల నుండి అటు అభిమానులను ఇటు ప్రేక్ష‌కుల‌ను ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు మహేష్ బాబు తన 27వ చిత్రానికి సంభందించిన పోస్టర్ రిలీజ్ చేసాడు. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు త‌న త‌ర్వాత చిత్రాన్ని గీతగోవిందం దర్శకుడు పరుశురామ్‌తో చేయ‌నున్నారు. అయితే నేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కావడంతో మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి ల’సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఓ పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ఇందులో మహేష్ బాబు చెవిపోగుతో, మెడపై రూపాయి టాటూతో కనిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టీ.. ఈ చిత్రంలో మహేష్ బాబుని మునుపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకాలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రం పొలిటికల్ సెటైర్ గా ఉండబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాబు భరత్ అనే నేను, మహర్షి చిత్రాలలో మహేష్‌ సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలను టచ్ చేశాడు.

ఇటీవ‌ల వ‌చ్చిన సరిలేరు నీకెవ్వరులో కూడా రాజకీయ నాయకులతో పాటు పార్టీలపై కూడా అదిరిపోయే సెటైర్లు వేసాడు. ఇప్పుడు పరశురామ్ సినిమాలో కూడా మరోసారి పాలిటిక్స్ బాగానే ఉంటాయని తెలుస్తుంది. అయితే సూపర్ స్టార్ గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా కథ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉంటుందని.. మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌‌గా కనిపించడమే కాదు.. కాలేజ్ స్టూడెంట్‌గాను అదరగొట్టనున్నాడట.

#SSMB27 `సర్కారు వారి పాట`.. మ‌ళ్లీ మహేష్ రాజకీయం మొదలైందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts