తండ్రి కృష్ణ పుట్టినరోజున మహేష్ ఏమ‌ని ట్వీట్ చేశాడో తెలుసా..?

May 31, 2020 at 8:54 am

సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 77వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. జనాదరణ పొందిన చిత్రాలు చేయడం, అత్యధిక సినిమాల్లో నటించడం, మూడు షిప్టుల్లో పనిచేయడం, సాహసోపేతమైన కథలను ఎంచుకోవడం, చలన చిత్రానికి సాంకేతిక హంగులు అద్దడం, కార్మికుల పక్షాన నటించడం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ…ఇవన్నీ ఘట్టమనేని కృష్ణను అక్షరాలా తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్‌స్టార్‌ను చేశాయి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు కృష్ణ. వెండితెరపై మెరిసిన అందగాడు. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది. అలాంటి కృష్ణ నేడు బర్త్ డే జ‌రుపుకుంటున్నారు. ఇక కృష్ణ తన పుట్టినరోజు ప్రతి ఏడాది అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటారు. అయితే గత ఏడాది ఆయన సతీమణి విజయనిర్మల మరణించడంతో కృష్ణ ఈసారి ఎలాంటి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. కాగా.. కృష్ణ పుట్టినరోజును ఆయన కొడుకు మహేష్ బాబు చాలా స్పెషల్ డేగా చూస్తుంటాడు.

ఈ సందర్భంగా మహేష్ తండ్రికి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. `బర్త్ డే శుభాకాంక్షలు నాన్న.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్` అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఈ రోజు కృష్ణ బర్త్‌డే సందర్భంగా మహేష్ 27వ చిత్రం లాంచ్ కానుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

తండ్రి కృష్ణ పుట్టినరోజున మహేష్ ఏమ‌ని ట్వీట్ చేశాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts