ఆ సూప‌ర్‌స్టార్ బ‌ర్త్‌డేకి ఈ సూప‌ర్‌స్టార్ ఇచ్చే గిఫ్ట్ ఏమిటంటే?

May 9, 2020 at 9:42 pm

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లె విడుద‌లైన త‌న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు బాక్సాఫీస్ వ‌ద్ద సునామీ సృష్టించింద‌ని చెప్పాలి. ఇక ఒక్క‌సారిగా యాన మార్కెట్ కూడా పెంచేసుకున్నాడు. ప్ర‌స్తుతం త‌న 27వ చిత్రాన్ని గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాంతో చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ నచ్చి లాక్ అయింది. లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ స‌హా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ రివీల్ చేయ‌డంలేదు. ఈనెల 17 తో లాక్ డౌన్ ముగుస్తోంది. తెలంగాణలో 29 వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగ‌నుంది.

అలాగే మే 31న సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌న్మదినోత్స‌వం అన్న విష‌యం తెలిసిందే. మ‌రి స‌ప‌ర్ స్టార్ 77వ పుట్టిన రోజు వేడుక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో అదే రోజున మ‌హ‌ష్ తన కొత్త విష‌యాల‌ను కూడా అభిమానుల‌కు వెల్ల‌డించ‌నున్నారని సోర్సెస్ చెబుతున్నాయి. ప‌ర‌శురాంతో ప్రాజెక్ట్ ను ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ఎక్క‌డా ప్ర‌క‌టించ‌ని నేప‌థ్యంలో మే 31న ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి స‌మాచారం. అలాగే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తో చేసే ప్రాజెక్ట్ ను మ‌హేష్ అదే రోజు ప్ర‌క‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. కాబ‌ట్టి 31 ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కు ట్రిపుల్ ట్రీట్ గా అస్వాదించాల్సిందే అన్న‌మాట‌.

ఇప్ప‌టికే ఈ స్క్రిప్ట్‌ డిఫ‌రెంట్ జాన‌ర్ అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. మ‌హేష్ ఇంత వ‌ర‌కూ ఇలాంటి జాన‌ర్ సినిమా ట‌చ్ చేయ‌లేదట‌. అతని కెరీర్ లో చెప్పుకునే చిత్రంగా నిలిచిపోతుంద‌ని క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. మ‌రిస్క్రిప్ట్‌ లో ఎంత మ్యాట‌ర్ ఉంటుంద‌న్న‌ది సినిమా విడుద‌ల‌యితే గాని చెప్ప‌లేం. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా మ‌హేష్ కుటుంబంతో హైద‌రాబాద్‌లోనే గ‌డుపుతున్నాడు. సితార‌..గౌత‌మ్ ల‌తో గేమ్ లు ఆడుకుంటూ కాల‌క్షేపం చేస్తున్నాడు. ఇటీవ‌ల బ‌య‌ట‌కొచ్చిన ఆ వీడియోలు అభిమానుల్ని తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

ఆ సూప‌ర్‌స్టార్ బ‌ర్త్‌డేకి ఈ సూప‌ర్‌స్టార్ ఇచ్చే గిఫ్ట్ ఏమిటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts