అస‌హ‌నంలో మ‌హేష్‌…అస‌లు కార‌ణం ఏమిటంటే?

May 29, 2020 at 8:50 am

మరో రెండురోజులలో తన నూతన చిత్ర ప్రకటన జ‌ర‌గ‌నుంద‌ని ఎంతో ఆనందంగా ప‌క్కా ప్లాన్‌గా అంచనా వేస్తుండగా మహేష్ బాబు అసహనంలో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి కారణం ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ లీకు కావడం పై మ‌హేష్ చాలా అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మహేష్ నెక్స్‌ట్‌ మూవీ దర్శకుడు పరశురామ్ తో చేస్తుండగా సర్కారి వారి పాట అనే టైటిల్ బయటికి వచ్చింది. ఇక దాదాపు ఇదే టైటిల్ ఖాయం అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ దీనిపై అసహనంగా ఉన్నారట. టైటిల్ లీక్ విషయంలో తన పి ఆర్ టీం పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించిన ట్రెండీ సబ్జెక్టుతో ఆ మ‌న ముందుకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. పరుశురాం ఈ చిత్రాన్నిఈ ట్రెండీ క‌థని తెరకెక్కించనున్నారట. సోషల్ కాన్సెప్ట్ ని టచ్ చేస్తూనే మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మహేష్ నెక్స్‌ట్‌ మూవీపై కూడా భారీగానే అంచనాలున్నాయి. మ‌హేష్‌కే కాదు ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఎంతో యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారు.

అస‌హ‌నంలో మ‌హేష్‌…అస‌లు కార‌ణం ఏమిటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts