
క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ పై తప్పుడు వార్తలు రాసిన సదరు వెబ్‌పైట్ పై ఆయన విరుచుకుపడుతూ ఓ వీడియోని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ ఆయన మొదలు పెట్టిన ఆ వెబ్‌సైట్‌ని కించపరుస్తూ ఓగాసిప్ వెబ్సైట్ విజయ్‌పై తప్పుడు వార్తలను రాసింది. దీంతో మండిపోయిన విజయ్ కిల్ ద ఫేక్ న్యూస్ అంటూ ఓ వీడియో చేసి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. దీంతో ప్రతిఒక్కరూ విజయ్‌కి అందరూ నిలుస్తున్నారు. అయితే ఈ విషయం పై ముందుగా స్పందించింది మాత్రం సూపర్‌స్టార్ మహేష్‌బాబు. నీవెంట మేమున్నామంటూ విజయ్‌కి భరోసా ఇచ్చారు.
`కిల్ ద ఫేక్ న్యూస్` పేరిట విజయ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది బాగా వైరల్ అవ్వడంతో. బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుతున్న సదరు వెబ్ సైట్ కి వ్యతిరేకంగా, విజయ్‌కి అనుకూలంగా గొంతులు లేస్తున్నాయి. ఎంతో మంది దర్శకులు, హీరోలు, టెక్నికల్ టీమ్ వీరందరూ కూడా స్పందిస్తున్నారు. విజయ్‌తోపాటు గొంతు కలుపుతున్నారు. `ఐ స్టాండ్ బై యూ బ్రదర్` అంటూ తొలి మద్దతు మహేష్ బాబు నుంచి వచ్చింది. కొరటాల శివ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, అనిల్ సుంకర, బీవీఎస్ రవి… ఇలా వీళ్లంతా తమ ట్వీట్ల ద్వారా విజయ్‌కి మద్దతు ప్రకటించారు. ఇది కచ్చితంగా విజయ్ దేవరకొండకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. విజయ్ పై వాళ్ళు రాసిన వార్తలు విజయ్‌ని చాలా బాధించాయి దీంతో అతను బ్లాస్ట్ అవ్వవలసి వచ్చింది.