పెళ్ళికి ఓకే చెప్పారు…ఫ‌స్ట్‌నైట్‌కి షాకిచ్చారు?

May 5, 2020 at 7:35 am

ప్ర‌పంచ‌మంతా క‌రోనా కార‌ణంగా ఒక్క‌సారిగా లాక్‌డౌన్‌కి వెళ్ళిపోయింది. దీంతో ఎక్క‌డివారు అక్క‌డే ఆగిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేవ‌లం నిత్య‌వ‌స‌రాల‌కు త‌ప్పించి దేనికి బ‌య‌ట‌కు రావ‌డానికి కూడా అధికారులు అనుమ‌తించ‌డం లేదు. ఇక పెళ్ళిళ్ళు, ఫంక్ష‌న్ల మాట అయితే స‌రేస‌రి దాని ఊసే ఎత్త‌డానికి లేదు. ఎందుకంటే ఎక్కువ మంది జ‌నం ఒక‌ద‌గ్గ‌ర ఉండ‌కూడ‌ద‌న్న‌దే ఈ వ్యాధి యొక్క ప్ర‌ధాన ల‌క్ష‌ణం. మ‌నిషికి.. మ‌నిషికి.. డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చెయ్యాలి. అంతేత‌ప్పించి ఎక్కువ మంది ఒకేచోట మూకుమ్మ‌డిగా ఉన్నా కాస్త అశుభ్ర‌త‌గా ఉన్నా ఈ వ్యాధి సంక్ర‌మించే ప్ర‌మాదం ఎంతైనా ఉంది. కాబ‌ట్టి ఫంక్ష‌న్లు లాంటి వాటికి అనుమ‌తి లేదు. అయితే కొంత మంది మాత్రం. లాక్ డౌన్ వేళలోనే పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. ఇందుకు అధికారుల వద్ద పర్మిషన్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకున్న ఒక జంటకు అధికారులు ఊహించని షాకిచ్చారు.

అదేమిటంటే… కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుత్యూరులో ఒక జంటకు పెళ్లి జరిగింది. అధికారులు సూచించిన దానికి తగ్గట్లే అతి తక్కువమందితో వారి వివాహ కార్యక్రమం పూర్తి అయ్యింది. పెళ్లి చేసుకున్న అమ్మాయిని వెంటపెట్టుకొని తమ ఊరికి తీసుకెళ్లాడు పెళ్లికొడుకు. గ్రామానికి చేరుకున్న వారు ఫస్ట్ నైట్ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకున్నారు.పెళ్లి చేసుకున్న జంట ఊరికి వచ్చి.. ఫస్ట్ నైట్ కోసం రెఢీ అవుతున్న స‌మ‌యంలో… అధికారులు ఎంట్రీ ఇచ్చి వారికి పెద్ద షాకిచ్చారు. కరోనా వేళ.. ముందస్తు జాగ్రత్తగా పెళ్లి కొడుకుతో సహా.. పెళ్లికి హాజరైన 26 మంది ముందు హోం క్వారంటైన్ లో ఉండాలని.. అప్పటి వరకూ ఫస్ట్ నైట్ ను వాయిదా వేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

అప్పటివరకూ కోటి ఆశలతో ఉన్న పెళ్లికొడుకు ఆ విష‌యం విన‌గానే ఒక్క‌సారిగా నీర‌స‌ప‌డిపోయాడు. అప్పటివరకూ ఫస్ట్ నైట్ గురించి కలలు కన్న ఆ పెళ్లి కొడుకు బాధలు వ‌ర్ణ‌నాతీతం అన్న‌మాట‌. ఒకే ఇంట్లో ఉంటూ ముహూర్తాలు చూసి ఫ‌స్ట్‌నైట్ చేయ‌డం అనేది కొంత మంది ఆన‌వాయితీ ఇక ఇదిలా ఉంటే పెళ్ళి చేసుకుని ముహూర్తం కుదిరి కాసేప‌ట్లో జ‌రిగే ఆ కార్య‌క్ర‌మాన్ని ఆప‌డం అంటే ఇది మ‌రి మామూలు విష‌యం కాదు. ఇది సేమ్ సినిమా సీన్‌లా ఉంది అని పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.

పెళ్ళికి ఓకే చెప్పారు…ఫ‌స్ట్‌నైట్‌కి షాకిచ్చారు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts