`గోవిందా గోవిందా` అంటూ నాగబాబు నుంచి మరో సంచలన ట్వీట్..!!

May 24, 2020 at 12:45 pm

జనసేన నేత మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్‌గా కామెంట్స్ చేస్తుండ‌డంతో.. ఈయ‌న‌ పేరు ప్ర‌స్తుతం మారు మోగిపోతోంది. మహాత్మ గాంధీని చంపిన నాథురాం గాడ్సే జయంతి రోజు ఆయన గురించి ఓ ట్వీట్ చేసి చర్చలకు తెరలేపారు నాగబాబు. ఆ త‌ర్వాత ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీతోపాటు నాడు స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసిన వారి ఫోటోలు ఉండాలని , ఆ మహానుభావుల చిత్రాలను చూడాలని ఉందని ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఇక తాజాగా నాగ‌బాబు మ‌రో సంచ‌ల‌న ట్వీట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న శ్రీవారి భూముల‌ను అమ్మ‌కానికి సిద్ధ‌మైంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు.

ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విష‌యంపై స్పందించిన మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏడు కొండల వాడా వెంకట రమణా.. గోవిందా గోవిందా. ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనితో సోషల్ మీడియా జనం కూడా దీనికి కాస్త సపోర్ట్ చేస్తున్నారు.కాగా, ఆస్తులు వేలం వేయాలనుకుంటున్న టీటీడీ చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

`గోవిందా గోవిందా` అంటూ నాగబాబు నుంచి మరో సంచలన ట్వీట్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts