నేడే రంజాన్‌.. 112 ఏళ్ల‌ చ‌రిత్ర‌ను గుర్తిచేసిన 2020..!!

May 25, 2020 at 10:29 am

ఏడాదికి ఒక‌సారి వ‌చ్చే రంజాన్ పండ‌గ ముస్లింల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ నెలను భావిస్తారు. ఇక ఈద్-ఉల్-ఫితర్ అనేది పవిత్ర రంజాన్ మాస ఉపవాస ముగింపు రోజుగా ముస్లిం సోదరులు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటారు. ముస్లింలు రంజాన్ పండుగ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించి అల్లా పట్ల తమ విధేయతను చాటుకుంటారు.

30 రోజుల ఉపవాస దీక్ష తరువాత నెలవంక దర్శనంతో దీక్ష విరమించి రంజాన్ పండగ జరుపుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండగ చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం రంజాన్ పండ‌గ‌పై క‌రోనా దెబ్బ ప‌డింది. ఈ క్ర‌మంలోనే ముస్లింలు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకోవడం తప్ప ఇప్పుడు మరో మార్గం లేదు. అయితే ఈ 2020 రంజాన్ పండ‌గ 112 ఏళ్ల చ‌రిత్ర‌ను మ‌ళ్లీ గుర్తిచేసింది.

మూసీ… ఈ పేరు వినగానే శతాధిక వృద్ధులకు 1908 నాటి వరదలు గుర్తుకొస్తాయి. పర్యావరణవేత్తలకు ఒక నది ఆవేదన గుర్తుకొస్తుంది. సాధారణ ప్రజలకు భరించలేని దుర్గంధం మాత్రమే గుర్తుకొస్తుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 1908 సెప్టెంబర్ 28 హైదరాబాద్‌ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాయి. అదే సమయంలో రంజాన్‌ మాసం కూడా ప్రారంభమైంది. కానీ, ఆ వరద బీభత్సాన్ని తట్టుకునే శక్తి ఆ మహానగరానికి లేకపోయింది. ఫలితంగా కేవలం 48 గంటల్లో 15 వేల మంది మృతి చెందారు. 80 వేల ఇళ్లు కూలిపోయాయి. ఒకే ఒక్క రోజులో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది.

మూసీ వరద తాకిడికి హైదరాబాద్ నగరంలోని అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ వంతెనలు తెగిపోయాయి. హైదరాబాదీలకు ఉపాధి కరువైంది. దీంతో రంజాన్ నెల ముగిసే నాటికి కూడా ప్రజలు ఇళ్ల నుంచి జనం బయటకి రాలేదు. ఈ క్ర‌మంలోనే ముస్లింలు పండుగ సంబరాల్ని పక్కనపెట్టి ఆ డబ్బును వరద బాధితుల సహాయార్ధం వెచ్చించారు. ఇది జరిగిన 112 ఏళ్ల తర్వా త, ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా దెబ్బకు భయపడి ప్రజలు రెండు నెలలుగా గడప దాటి బయటికి రావట్లేదు. లాక్‌డౌన్ కారణంగా రంజాన్ మాసం నగరంలో కళ తప్పింది. అందరూ ఎంతో ఇష్టపడే హలీం ఈసారి మాయమైంది. మసీదులు తెరుచుకున్నా ఇంటిలోనే ప్రార్థనలు చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నేడే రంజాన్‌.. 112 ఏళ్ల‌ చ‌రిత్ర‌ను గుర్తిచేసిన 2020..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts