ఆ పార్టీ మాత్రం మళ్లీ అధికారంలోకి రాద‌ట‌.. నాగ‌బాబు హాట్ కామెంట్స్‌..!!

May 30, 2020 at 3:42 pm

సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ నేత‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. సోషల్‌ మీడియా వేదిక‌గా రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవలె జాతిపిత మహాత్మ గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదస్పద ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఈ క్రమంలోనే ఆయ‌న‌పై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆగ‌ని నాగ‌బాబు.. ఆ త‌ర్వాత వివాదాస్పద ట్వీట్ల‌‌తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక మొన్న‌టికి మొన్న బాల‌య్య వ్యాఖ్య‌ల‌పై కూడా ఘాటుగానే స్పందించాడు నాగ‌బాబు.

ఇక తాజాగా మరోసారి టీడీపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమంటూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే, టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదనేది తన నమ్మకమని అన్నారు. ఎందుకంటే తెలుగుదేశం తన హయాంలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధి అంతా టీవీ, పేపర్లలోనే కనిపించించ‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌ గ్రౌండ్ లో కనిపించింది తక్కువ.. అలాగే అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి.. వాటి గురించి ఈ ట్విట్టర్ ఏం సరిపోతుంది.. లక్ష పేజీల గ్రంథాలే రాయొచ్చని.. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింద‌ని ఎద్దేవా చేశారు. ఈ విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలని నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. మ‌రియు వచ్చే ఎన్నికలలో మళ్లీ మేమే వస్తాం అనే భ్రమల్లోంచి బయటపడాలని చెప్పారు. మేము కలల్లోనే జీవిస్తాం అని అంటే చేసేదేమీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితిని మానసికశాస్త్రంలో హెల్యూజినేషన్స్ అని అంటారని… `ఆల్ ది బెస్ట్ ఫర్ హెల్యూజినేషన్స్..` అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఆ పార్టీ మాత్రం మళ్లీ అధికారంలోకి రాద‌ట‌.. నాగ‌బాబు హాట్ కామెంట్స్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts