బిగ్ షాక్‌: ఇక‌పై మ‌ద్యం కొనుగోలు చేయాలంటే అది ఉండాల్సిందే..!!

May 7, 2020 at 10:48 am

ప్ర‌స్తుతం భార‌త్‌లో మూడో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే కేంద్రం మూడో ద‌శ లాక్‌డౌన్‌లో మందుబాబుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ.. మ‌ద్యం షాపులు తెర‌వ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్రాల‌తో పాటు ఆంధ్రప్ర‌దేశ్‌లోనూ సోమ‌వారం నుంచి మ‌ద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మందుబాబుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఏపీలో తొలుత 25 శాతం పెంచిన జగన్ సర్కారు తర్వాత 50 శాతం చెప్పింది. దీంతో మద్యం ధర 75 శాతానికిపైగా పెరిగింది.

ప్రజలకు మద్యం దూరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ సర్కారు వెల్ల‌డించింది. అయిన‌ప్ప‌టికీ మందుబాబులు ఏ మాత్రం వెన‌కాడ‌లేదు. కావాల్సినంత మ‌ద్యం కొనుగోలు చేసుకున్నాయి. అయితే రెడ్ జోన్ల నుంచి కొందరు ఇతర జోన్లకు మద్యం కోసం వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనను తెచ్చింది. సదరు కొనుగోలుదారు తన ఆధార్ కార్డును చూపిస్తేనే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది.

రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ క్లస్టర్ల పరిధిలో మద్యం దుకాణాలు తెరవకపోవడంతో, ఆ ప్రాంతాల నుంచి బయటకు వస్తున్న వారు, మద్యం కోసం క్యూ లైన్లలోకి వస్తున్నారని, ఈ కారణంగానే ఆధార్ కార్డును పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇక ముఖానికి మాస్క్, గొడుగులు ధరించి మాత్రమే మద్యం కోసం రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

బిగ్ షాక్‌: ఇక‌పై మ‌ద్యం కొనుగోలు చేయాలంటే అది ఉండాల్సిందే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts