ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్‌.. ఇకపై పాఠాలు అక్క‌డే..!!

May 27, 2020 at 8:19 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం అన్ని దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా ప్ర‌పంచంపై దాడి మొద‌లు పెట్టు నెల‌లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టికీ దీని దూకుడు త‌గ్గ‌డం లేదు. రోజురోజుకు మ‌రింత వేగంతో విజృంభిస్తుంది. ఈ క్ర‌మంలోనే గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3.51 ల‌క్ష‌ల‌ మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో అధిక శాతం మరణాలు ఒక్క యూరప్‌ ఖండంలో సంభవించడం అక్కడి ఈ వైరస్‌ విజృంభణకు అద్దం పడుతోంది.

మనీ పవర్‌తో గ్లోబ్‌పై ఉన్న దేశాలను శాసించే అమెరికా సైతం క‌రోనా ముందు చిగురుటాకులా వణికిపోతోంది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధింయ‌డంతో.. అన్ని సంస్థ‌ల‌తో పాటు విద్యాసంస్థ‌లు కూడా మూత‌ప‌డ్డాయి. అయితే క‌రోనా దెబ్బ‌కు విద్యా వ్యవస్థలో ఎన్న‌డూలేని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ మహమ్మారి నుంచి త‌ప్పించుకోవాలంటే స్వీయ నియంత్రణే ముందున్న దారి కావ‌డంతో.. అధికారులు ఆన్‌లైన్‌ పాఠాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందించాలని ఇంటర్ విద్యాశాఖ కసరత్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంటే ఇంట‌ర్ విద్యార్ధులకు ఆన్‌లైన్‌లోనే క్లాసులు చెప్ప‌నున్నార‌న్న‌మాట‌.‌ ఇందుకు ప్రభుత్వ ఛానల్ టీశాట్, ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానల్ తదితర వాటిని యూజ్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు. కాగా, వీటిపై నేడు తెలంగాణ‌లో జ‌రిగే కీల‌క స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. మ‌రియు ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, కళాశాలల పునః ప్రారంభంపై కూడా ఆమె సమీక్షించనున్నారు.

ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్‌.. ఇకపై పాఠాలు అక్క‌డే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts