ప్రకాష్ రాజ్ వ‌ల్లే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడా..??

May 15, 2020 at 10:35 am

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 10వ తేదీ ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో తేజస్విని వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా అతికొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జ‌రిగింది. అంతేకాదు, ఆస్ట్రాలజీ నమ్మకాల ప్రకారం.. పెళ్లి చేసుకునే ముందే దిల్ రాజు ఆమె పేరును మేఘా రెడ్డిగా మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో దిల్ రాజు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆయన రెండో పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు మొదటి భార్య అనిత.. అనారోగ్యంతో కన్ను మూశారు. అప్పటి నుంచీ ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో అది గమనించిన దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హర్షిత రెడ్డి.. తండ్రిని ఒప్పించి రెండో పెళ్లి చేసింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు దిల్ రాజు పెళ్లిపై మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవ‌డం వెన‌క విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ హ‌స్తం ఉందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి రెండో పెళ్ళి చేసుకోవాలని, జీవితంలో ఓ తోడు ఉంటేనే విజయ తీరాలకు అలవోకగా చేరుకోగలమని ఆయన దిల్ రాజుతో చెప్పారట. ఎలాగైనా రెండో పెళ్లి చేసుకోవాల్సిందే అని ప్రకాష్ రాజ్ ఫోర్స్ చేయడం వల్లనే దిల్ రాజు ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. మ‌రోవైపు దిల్ రాజు పెళ్ళికి ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా హర్షిత రెడ్డి ఉన్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

ప్రకాష్ రాజ్ వ‌ల్లే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడా..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts