బాలయ్య వస్తానంటే మేం వద్దంటామా.. సి. కళ్యాణ్ కౌంటర్..!!

May 28, 2020 at 4:04 pm

మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నట రత్న నంద‌ర‌మూవి తార‌క రామారావు 97వ జయంతి సందర్భంగా నంద‌మూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్‌లో తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని.. పత్రికల్లో చూసి తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానని చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్రజలతో పాటు టాలీవుడ్ లో సైతం దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా ప్ర‌ముఖ నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. సీఎం కేసీఆర్‌ను సినీ ప్రముఖులు కలిసిన మీటింగ్‌కి బాలకృష్ణని పిలవాల్సిన బాధ్యత ‘మా’ అసోసియేషన్‌దేనన్నారు.

చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి మంత్రి తలసాని లీడ్‌ తీసుకున్నారని చెప్పారు. సినిమా రంగంలో విభేదాలు లేవని, అంతా ఒక్కటేనని సీ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక నిన్నటి దాకా దాసరి నారాయణ రావుగారు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి భుజాన వేసుకోవచ్చు. చిరంజీవిగారి ఫేస్ వ్యాల్యూ పనికొస్తుందని ఆయనను మేం అడిగాం. అలాగే నాగార్జున గారు వచ్చారు. అలాగే నాగార్జున గారు వచ్చారు. ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం. ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లను తీసుకెళ్తాం. షూటింగ్‌లకు ఇబ్బందులు లేకుండా పని జరగడం మాకు ముఖ్యం.

మేము ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. సినిమా వాళ్లం. అని కల్యాణ్ తెలిపారు. ఇక నన్ను పిలవలేదు అనడానికి ఇది ఆర్టిస్ట్‌ల మీటింగ్ కాదు.. బాలకృష్ణ గారు వస్తానంటే ఎవరైనా కాదంటారా? అంతే తప్పితే వీళ్లను పిలవాలి.. వీళ్లను పిలవ కూడదు అనేం లేదు. బాలకృష్ణ గారు మా హీరో. అలాగే టాలీవుడ్‌లో బాలకృష్ణది ప్రత్యేక స్థానమని, ఆయనకు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తామన్నారు. ఆయనకు ఇక్కడ జరిగింది మొత్తం చెప్పాను. మిమ్మల్ని పిలిచారా? అని ప్రెస్ అడగడం వల్ల.. నన్ను పిలవలేదు, పేపర్‌లలో చూసి తెలుసుకుంటున్నా అని అన్నారు తప్పితే.. ఇది ఆర్టిస్ట్‌లను పిలిచే మీటింగ్ కాదు. అవసరం అనుకుంటే తప్పకుండా పిలుస్తాం. మ‌రియు సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని… ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవని అన్నారు.

బాలయ్య వస్తానంటే మేం వద్దంటామా.. సి. కళ్యాణ్ కౌంటర్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts