మందుబాబుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై అక్క‌డ లిక్కర్ హోం డెలివరీ

May 7, 2020 at 7:56 am

క‌రోనా వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తున్న వేళ భార‌త్‌లో మూడో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా మందుబాబులు పిచ్చెక్కిపోయిన సంగ‌తి తెలిసిందే. ఒక్క చుక్క కూడా మందు దొర‌క్క మందుబాబుల్లో కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మూడో ద‌శ లాక్‌డౌన్‌లో మ‌ద్యం షాపుల‌కు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీంతో ప‌లు రాష్ట్రాల్లో సోమ‌వారం నుంచే మ‌ద్యం దుకాణాలు తెరుచుకున్నారు. ఇక 40 రోజుల త‌ర్వత మ‌ద్యం షాపులు ఓపెన్ అవ్వ‌డంతో మందుబాబుల‌కు రెక్క‌లొచ్చిన‌ట్టు అయింది.

ఇక ఎన్నికల్లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చునే ఓటరులా.. వైకుంఠ ఏకాదశి రోజు దేవతా మూర్తుల దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తుల్లా.. మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో భౌతిక దూరం కూడా పాటించ‌కుండా మ‌ద్యం షాపుల మందు క్యూలు కుడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ డోర్ డెలివరీ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్‌, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు మద్యం డోర్‌డెలివరీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఇక పంజాబ్‌ రాష్ట్రంలో గురువారం నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుందని పంజాబ్ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

అయితే కేవలం లాక్‌డౌన్ అమలయ్యే సమయంలోనే లిక్కర్ హోం డెలివరీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇక పంజాబ్ బాటలోనే అటు వెస్ట్ బెంగాల్ కూడా లిక్కర్ డోర్ డెలివరీ సర్వీస్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఆన్‌లైన్‌లో లిక్కర్ ఆర్డర్ చేస్తే వారికి ఇంటికే వెళ్లి మద్యం డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం ఓ సపరేట్ వెబ్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇలా చేయడం ద్వారా లిక్కర్ షాపుల వద్ద రద్దీ తగ్గించే అవకాశం ఉంటుందని ఆ రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి.

మందుబాబుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై అక్క‌డ లిక్కర్ హోం డెలివరీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts