భార‌త్‌లో అందుకే క‌రోనా విజృంభిస్తుంది.. రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు..!!

May 26, 2020 at 4:00 pm

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌పంచ‌దేశాలు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు త‌గ్గ‌డం లేదు. మ‌రోవైపు భారత్‌‌లోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ టాప్-10లోకి చేరింది.

అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కరోనా తీవ్ర స్థాయిలో పెరిగిపోతోన్న టైమ్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటేనని, అందుకే కరోనా రోజురోజుకు విజృంభిస్తుంద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌తో కరోనా మహమ్మారిని కట్డడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా విఫలమైందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

అలాగే దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం కాదు.. మరింత పెరుగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయట్లేదు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాటం చేశాం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రియు లాక్‌డౌన్ ముగింపు స‌మీపిస్తున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎటువంటి వ్యూహాన్ని అనుస‌రించ‌నున్న‌దో చెప్పాలని డిమాండ్ చేశారు. మ‌రి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

భార‌త్‌లో అందుకే క‌రోనా విజృంభిస్తుంది.. రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts