కష్టకాలంలో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన జక్కన్న

May 11, 2020 at 7:37 am

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయంలో రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం సర్వత్రా నెలకొంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో సినిమా రంగానికి చెందిన పలు విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని, అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని జక్కన్న తెలిపాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి, రాబోయే రోజుల్లో సినిమా ప్రొడక్షన్ ఖర్చులు ఆదా చేయడానికి ఆ సినిమా స్టాఫ్‌ను చాలా వరకు తగ్గించాల్సి ఉంటుందని, కొత్త టెక్నాలజీ సాయంతో ఎక్కువ క్రూ లేకుండానే సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే కరోనా మహమ్మారి నుండి కాపాడుకునేందుకు అయితే ఈ ఐడియా బాగుంది కానీ, పూర్తిగా సినిమాల్లో స్టాఫ్‌ను తగ్గించడం ఏమిటని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది ఉపాధిని కోల్పోతారని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి సమయంలో ఇలాంటి ఆందోళన కలిగించే స్టేట్మెంట్ ఏమిటి జక్కన్న అని వారు ప్రశ్నిస్తున్నారు.

కష్టకాలంలో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన జక్కన్న
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts