ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమా ట్రైలర్ వ‌చ్చేసింది..!!

May 26, 2020 at 6:13 pm

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ అనే సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా యావత్తూ లాక్ డౌన్ కాలంలోనే తెరకెక్కించామని వెల్లడించారు. కరోనా వైరస్ సబ్జెక్టుపై ప్రపంచంలో ఇదే తొలి చిత్రం అవుతుందని వర్మ పేర్కొన్నారు. తమ చిత్రంలోని నటీనటులు, సిబ్బంది సృజనాత్మకత చాటుకున్నారని, లాక్ డౌన్ కాలంలో వారి క్రియేటివిటీకి లాక్ డౌన్ లేకుండాపోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ చిత్రం ట్రైలర్ మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుందని వర్మ ట్వీట్ చేశారు.

అయితే వ‌ర్మ చెప్పిన టైమ్ రానే వ‌చ్చేసింది. అనుకున్న‌ట్టుగానే కరోనా వైరస్ ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. లాక్ డౌన్ సమయంలో కరోనా ఇంట్లోకి ప్రవేశిస్తే దాని వలన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడింది అన్నది సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఇండియాలో మొదటి కరోనా వైరస్ సినిమా ఇదే అని చెప్పాలి.

ఒక ఇంట్లో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ సినిమాను తీశాడు. ఈ సినిమా మొత్తాన్ని లాక్‌డౌన్ పీరియడ్‌లో షూట్ చేయ‌డం మ‌రో విశేషం అని చెప్పుకోవాలి. కాగా, ఈ లాక్‌డౌన్ సమయంలో ఇప్పటికే వర్మ ఒక షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశారు. ‘క్లైమాక్స్’ పేరుతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో పోర్న్ స్టార్ మిమా మాల్కోవా ప్రధాన పాత్ర పోషించింది. ట్రైలర్‌తో పిచ్చెక్కించిన వర్మ ఈ షార్ట్ ఫిల్మ్‌ను కూడా విడుదల చేశారు.

ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమా ట్రైలర్ వ‌చ్చేసింది..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts