స్టార్ డైరెక్ట‌ర్ అయుండి మ‌రీ ఇంత‌బ‌రితెగింపా?

May 23, 2020 at 6:58 pm

వివాదాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఏ విష‌యం పైన ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతాడో ఆయ‌న‌కే తెలియ‌దు. ఇక ఆయ‌న టేస్ట్‌ల‌న్నీ కూడా చాలా వింత‌గా ఉంటాయి. పోర్న్ స్టార్ మియామాల్కోవాతో క‌లిసి జీఎస్టీ అంటూ అప్ప‌ట్లో బోలెడంత హంగామా చేస్తూ ఓ చిత్రాన్ని తీసిన విష‌యం తెలిసిందే. గాడ్ సెక్స్ ట్రూత్! అంటూ యూత్ వెర్రెక్కిస్తూ.. ప్ర‌చారం చేసుకుని యూట్యూబ్ లో బూతు సినిమాని అమ్ముకున్నాడని అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లొచ్చాయి. దాని పైన న్యూస్ ఛాన‌ల్స్‌లో కూడా చాలా డిబేట్‌లు జ‌రిగాయి. ఇక మ‌హిళా సంఘాలు కూడా ఒక‌టై డిబేట్‌లు పెట్ట‌డం జ‌రిగింది.
ఇక బిజినెస్ చేయ‌డం అనేది ఇంపార్టెంట్! ఈ క్వాలిటీ ఆర్జీవీకే ఉంద‌ని ప్రూవైంది.

ఇక‌పోతే ఇప్పుడు కూడా అత‌డు అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడా? అని మ‌ళ్ళీ సోష‌ల్‌మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి. మ‌రోసారి శృంగార తార‌ మియా మ‌ల్కోవాతో కలిసి శృంగారమే ధ్యేయంగా యూత్ పై మంత్రం వేస్తున్నాడా? అంటే అవున‌నే మొన్న రిలీజైన మియా మ‌ల్కోవా `క్లైమ‌క్స్` ట్రైల‌ర్ రివీల్ చేసింది. త్వ‌ర‌లోనే దీనిని నెట్ ఫ్లిక్స్ లో లైవ్ చేయ‌నున్నారు. ఇక డిజిట‌ల్లో అద్భుత‌మైన వ్యూవ‌ర్ షిప్ సాధ్య‌మేన‌ని అంచనా వేస్తున్నారు.

అంతేకాదు.. ఇక ఈ చిత్రం క్లైమాక్స్ కి ఆర్జీవీ ప్ర‌చారం మామూలుగా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు మియా మల్కోవా వేడెక్కించే భంగిమ‌ల్ని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తున్న ఆర్జీవీ.. మియాకి సీన్లు వివ‌రిస్తున్న కెప్టెన్ ఫోటోల్ని రివీల్ చేశాడు. ఇవ‌న్నీ ప్ర‌స్తుతం యూత్ లో హాట్ టాపిగ్గా మారాయి. ఆర్జీవీ మ‌రీ ఇంత‌గా భ‌రితెగించాడేమిటి? ఇలా ఓ శృంగార తార భంగిమ‌ల్ని సేల‌బుల్ పాయింట్ గా ఎంచుకుని ఇలా చేస్తాడా? అంటూ సీరియ‌స్ అవుతున్నారంతా. త‌న స్థాయిని మ‌రీ ఇంత‌లా త‌గ్గించుకుని మ‌రీ ఇలా దిగ‌జారుడు సినిమాలు తీస్తాడేమిటో! అంటూ అంద‌రూ విరుచుకుప‌డుతున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ అయుండి మ‌రీ ఇంత‌బ‌రితెగింపా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts