రానా బావా… రామానాయుడులో నీపెళ్ళి త‌ర్వాత నాపెళ్ళే అంటూ శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్‌

May 20, 2020 at 2:11 pm

టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్‌ల‌ర్ రానా ఓ ఇంటివాడు కాబోతున్న విష‌యం తెలిసిందే. రానా మ‌హికాల నిశ్చితార్ధం ఈ రోజు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో జరగబోతుంది. ఇక‌ ఈ నిశ్చితార్థం రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 4గం.లకి జరగనుంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన కేవలం కొద్ది మంది ప్ర‌ముఖులు మాత్రమే హాజర్ కానున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉండటంతో అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంద‌ని తెల‌పారు.

ప్రస్తుతం రానా ఎంగేజ్మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఇలాంటి స‌మ‌యంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ మధ్య రానా, మిహీకాలకు శుభాకాంక్షలు తెలిపిన‌ శ్రీరెడ్డి.. ఇప్పుడు రానా నిశ్చితార్థం గురించి తెలుసుకుని త‌న సోష‌ల్ మీడియాలో ఈ విధంగా స్పందిస్తూ.. రానా బావకు పెళ్లి అంటూ పోస్ట్ చేసింది. ‘రానా బావకు ఎంగేజ్ మెంట్ ఈరోజే. రామానాయుడు స్టుడియోలో.. నెక్స్‌ట్ నాదే’ అంటూ కన్ను కొట్టే ఎమోజీతో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. దాంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ దుమ్ము దూమారం రేపింది. శ్రీరెడ్డికి రానా తమ్ముడు అభిరామ్‌తో ఎఫైర్ ఉందని ఇదివరకే తెలిపింది.

అంతేకాక‌ వీరిద్దరు ఏకాంతంగా గడిపిన ఫోటోలను కూడా శ్రీరెడ్డి బయటపెట్టి రచ్చ ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఎప్పుడు కుదిరితే అప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకుంటూ వస్తూ ఏదోర‌కంగా సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఇక సురేష్ బాబుని మామా అని.. రానాని బావా అని.. వెంకటేష్‌ని చిన మామా అంటూ గతంలో కూడా వరసలు కలిపింది ఈ భామ‌. ఇక ప్ర‌స్తుతం రానా ఫ్యాన్స్ అంద‌రూ కూడా శ్రీ‌రెడ్డి పై మండిప‌డుతున్నారు.

రానా బావా… రామానాయుడులో నీపెళ్ళి త‌ర్వాత నాపెళ్ళే అంటూ శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts