రేప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు..

May 11, 2020 at 11:33 am

మనుషుల్లో క్రమంగా మానవత్వం అనేది కనపడటం లేదు అనే వ్యాఖ్యలు ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం. కామం తో కళ్ళు మూసుకుపోయిన జనాలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క లాక్ డౌన్ ఉన్నా సరే కామందులు మాత్రం మారడం లేదు. తాజాగా ఒక ఆందోళన కర సంఘటన జరిగింది. ఏప్రిల్ 24 న ఈ ఘటన జరగగా అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.


బీహార్‌లోని… దంర్భంగా జిల్లాలోని… ఓ గ్రామంలో ఆ రోజు తన ఇంటికి వెళ్తున్న బాలికను గమనించి అత్యాచారానికి దిగారు. ఆమె నడుస్తూ ఉండగా గమనించిన ఒకడు ఆమె నోరు మూసి వంద మీటర్ల దూరం లాక్కునిపోయారు. ఆమె అరుస్తున్నా సరే వాళ్ళు మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఒకడు ఆమె కాళ్ళు పట్టుకుని లాక్కుని వెళ్ళాడు. మొత్తం 5 మంది ఈ ఘటనలో ఉన్నారు.

ఆ అమ్మాయి ఏడ్చినా అరిచినా సరే ఆగలేదు. పక్కనే ఉన్న మామిడి తోటలోకి తీసుకుని వెళ్లి ఒకడి తర్వాత ఒకడు ఆమెను అనుభవించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒకడు వీడియో కూడా తీసాడు. అలాగే కొన్ని ఫోటో లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో ఫోటో లు విస్తృతంగా వైరల్ అవ్వడం ఆ బాలికకు కనపడటం తో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ రోజు జరిగిన ఘటనను అప్పటి వరకు సైలెంట్ గా ఉంచిన సదరు బాలిక… ఆ తర్వాత పోలీసులకు అసలు విషయాన్ని వివరించింది. నిందితులపై ఐసీపీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలను డిలీట్ చేసారు. ఈ ఘటనపై బీహార్ సర్కార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

రేప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts