సాయితేజ్ `నో పెళ్లి` సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసిన‌ రానా, వరుణ్..!!

May 25, 2020 at 12:40 pm

ఇటీవ‌ల ప్రతిరోజూ పండగే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. సూప‌ర్ హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సాయితేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఆ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా సుబ్బు అనే యువ దర్శకుడు సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానిక తమన్ సంగీతం అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేశారు చిత్రయూనిట్‌. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ నిన్నే వెల్లడించారు. `పాట పేరు ‘నో పెళ్లి’. ఈ పాటలో బోలెడంత ఫన్ ఉంటుంది. బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. రేపు ఉదయం 10 గంటలకు సిద్ధంగా ఉండండి` అంటూ త‌మ‌న్ నిన్న ప్ర‌క‌టించాడు. అయితే ఆ టైమ్ రానే వ‌చ్చేసింది. తాజాగా ఈ సినిమాలోని `నో పెళ్లి` సాంగ్‌ను సినీ బృందం విడుదల చేసింది.

అయితే ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ ఉండ‌డం ఓ స‌ర్‌ప్రైజ్ అని చెప్పుకోవాలి. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను హీరో నితిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ‘ఎన్ని రోజులు ఇలాగే సింగిల్‌గా ఉంటావో చూస్తా.. కొన్ని సార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కాని చేసుకోవ‌డం ప‌క్కా’ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పాటను పెళ్లికాని వారందరికీ అంకితమిస్తున్నట్లు సాయితేజ్ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ వైర‌ల్‌గా మారింది.

సాయితేజ్ `నో పెళ్లి` సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసిన‌ రానా, వరుణ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts