50 రోజులు ఇంట్లో ఉండి, ఏటీఎంకి వెళ్లి కరోనా తెచ్చుకున్నాడు…!

May 22, 2020 at 5:34 pm

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతూనే ఉంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం రావడం లేదు. ఇక అది ఏ విధంగా వ్యాపిస్తుంది అనే దానిపై ఇప్పుడు చాలా వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు మనుషులు తీసుకున్నా సరే దాని దాడి అది చేస్తూనే ఉంది గాని ఆగడం లేదు. ఇక చెన్నై విషయానికి వస్తే… అక్కడ కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి.

చెన్నైలో ఒక ప్రైవేట్ ఆఫీస్ లో పని చేస్తున్న వ్యక్తి… లాక్‌డౌన్‌తో 50 రోజులుగా ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు. బుధవారం నుంచి పని చేస్తున్న సంస్థలో కార్యకలాపాలు మొదలయ్యాయి. దీనితో… కరోనా పరిక్షలు చేయించుకుని ఆఫీస్ కి వెళ్ళాలి అని సమాచారం ఇవ్వడంతో అతను వెళ్లి పరిక్షలు చేయించుకున్నాడు. కరోనా పరీక్షల్లో వచ్చిన ఫలితం చూసి అతను షాక్ అయ్యాడు. అతనికి పాజిటివ్ అని వచ్చింది.

ఈ నేపధ్యంలో సదరు వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతంలో చెన్నై కార్పొరేషన్‌ అధికారులు రాకపోకలు నిషేధించి ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటేషన్ చేసారు. కుటుంబ సభ్యులు అందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు అధికారులు. అయితే అతను 50 రోజులుగా ఇంట్లో ఉన్నా సరే ఏ విధంగా కరోనా వచ్చింది అనే విషయాన్ని ఆరా తీయగా అతను ఏటీఏ౦కి వెళ్ళాడు అని అక్కడ కరోనా వచ్చింది అని అధికారులు నిర్ధారించారు.

50 రోజులు ఇంట్లో ఉండి, ఏటీఎంకి వెళ్లి కరోనా తెచ్చుకున్నాడు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts