శభాష్; వలస కూలీలకు నేనున్నా అంటూ ముందుకు వచ్చిన సుప్రీం కోర్ట్

May 28, 2020 at 6:57 pm

దేశ వ్యాప్తంగా వలస కూలీల విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని విధాలుగా సహాయం చేస్తున్నామని ఎన్ని మాటలు చెప్పినా సరే ఒక్కటి కూడా క్షేత్ర స్థాయిలో వలస కూలీలకు అందే పరిస్థితి లేదు అనేది వాస్తవం. చాలా వరకు వలస కూలీలకు ఇప్పుడు భవిష్యత్తు మీద భయం పట్టుకుంది. ఈ తరుణంలో వలస కూలీల కోసం సుప్రీం కోర్ట్ అండగా నిలబడింది. సుప్రీం కోర్ట్ ఒక్కటే వారి కోసం కీలక ఆదేశాలు ఇచ్చింది.

వలస కూలీల సమస్యను సుమోటో గా తీసుకున్న అత్యున్నత ధర్మాసనం… వారు సొంత ఊళ్లకు వెళ్లిపోతామని చెప్తే వారిని ఆపే ప్రయత్నం చేయవద్దు అని స్పష్టం చేసింది. వారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టి వెంటనే పూర్తి చెయ్యాలని చెప్పింది. వారికి ఆహారం పానీయాలు అన్నీ కూడా అందించాలని చెప్పింది. ఎక్కడ ఆహారం దొరుకుతుందో వారికి రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

కార్మికులందరికీ ఉచితంగా ఆహారం సరఫరా చేయాలని ఆదేశించింది. వారు వెళ్ళే బస్సులు రైళ్ళ ఖర్చులు అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలని వారి వద్ద నుంచి రూపాయి కూడా వసూలు చేయవద్దు అని పేర్కొంది. నడుచుకుంటూ వెళ్తూ ఉన్న వలస కూలీలను వెంటనే ఆదుకోవాలని, జూన్ 5 తర్వాత కేసుని విచారిస్తామని అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారో తమకు చెప్పాలి అని పేర్కొంది రోడ్లపై నడుస్తూ వెళుతున్న వలస కూలీలను సమీపంలోని క్యాంపులకు తీసుకువెళ్లి వారికి అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సూచనలు చేసింది.

శభాష్; వలస కూలీలకు నేనున్నా అంటూ ముందుకు వచ్చిన సుప్రీం కోర్ట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts