అందుకు రెడీ అంటున్న సురేఖా వాణి కూతురు..!!

May 26, 2020 at 1:34 pm

సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా అడుగుపెట్టిన ఈమె.. సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అక్క, వదిన, అమ్మ ఇలా సురేఖ వాణి సినిమాల్లో హోమ్లీ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె భర్త మరణించిన తరువాత అవకాశాలు తగ్గాయో, లేక ఆమెనే తగ్గించుకుందో కానీ సినిమాలు అయితే చేయడం లేదు. కానీ టిక్ టాక్ పుణ్యమా అని ఇప్పటిదాకా ఉన్న హోమ్లీ ఇమేజ్ ని దూరం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది సురేఖ‌.

ఇక సురేఖ వాణి కూతురు పేరు సుప్రీత. సుప్రీత ప్రస్తుతం చదువుకుంటూనే, తల్లికి ఇష్టమైన సినిమా రంగంవైపు అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. అంతేకాక సురేఖ‌ కూతురుతో కలిసి చేస్తున్న ఫొటో షూట్స్ మరియు వీడియోలు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. ప్రముఖంగా వీరిద్దరు కలిసి చేసిన కొన్ని హాట్‌ స్టెప్పులు సంచలనం సృష్టించాయి. ఈ క్ర‌మంలోనే సురేఖ తన కూతురును హీరోయిన్‌గా చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందంటూ టాక్ కూడా వ‌చ్చింది.

అయితే వాస్త‌వానికి సుప్రీతను హీరోయిన్ గా చూడాలనేది ఆమె తండ్రి కోరిక అట. సురేఖావాణి కూడా సుప్రీతకు హీరోయిన్ అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. ఆ విషయాన్ని ఆమె అన్యాపదంగా బయటపెట్టింది. దీనిని బ‌ట్టీ.. ప్ర‌స్తుతం సుప్రిత హీరోయిన్ అయ్యేందుకు రెడీగా ఉంద‌ని అర్థం అవుతోంది. ఇక యువ హీరోల సరసన నటించే ఏజ్ లో ఉన్న సుప్రీత మరి ఏ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

అందుకు రెడీ అంటున్న సురేఖా వాణి కూతురు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts