ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్..‌ నేటి నుంచి షురూ కానున్న షూటింగ్లు..!!

May 31, 2020 at 8:03 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా దెబ్బ‌కు దేశ‌దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనాకి జాలి క‌ల‌గ‌డం లేదు. ఇప్ప‌టికే ల‌క్ష‌లు మందిని పొట్ట‌న‌పెట్టుకున్న ఈ క‌రోనా భూతం.. ఇంకెంత మందిని బ‌లితీసుకుంటుందో అర్థంకాని ప‌రిస్థితి. ప్రస్తుతం కరోనా వైర‌స్‌ భయం వల్ల‌ పలు దేశాలు పూర్తిగా లాక్‌డౌన్‌ చేయబడడంతో పాటు ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసేలా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు చేపట్టాయి. అయితే లాక్‌డౌన్ ప్రారంభించి రెండు నెల‌లు గ‌డుస్తున్న త‌రుణంలో.. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ నుంచి కొన్నిటికి స‌డ‌లింపులు ఇస్తోంది.

ఈ క్ర‌మంలోనే షూటింగ్స్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే సినిమా షూటింగ్స్ కాదండోయ్‌. వాస్త‌వానికి క‌రోనా దెబ్బ‌కు కేవలం వెండితెరపైనే కాదు బులితెర మీద కూడా ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్‌డౌన్ కారణంగా పలు సీరియల్స్, రియాలిటీ షోస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో బుల్లితెర పరిశ్రమకు కరోనా కష్టకాలం వచ్చేసింది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో మూతబడిన చెన్నై టీవీ పరిశ్రమ మళ్లీ తెరుచుకోబోతోంది. టీవీ సీరియళ్ల షూటింగ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కానీ, గరిష్టంగా 20 మందితో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అంత కొద్దిమందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మందితో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ఇక వారి విజ్ఞప్తిని పరిశీలించిన ముఖ్యమంత్రి శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే నేటి నుంచి సీరియ‌ల్ షూటింగులు ప్రారంభం కానున్నాయి.

ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్..‌ నేటి నుంచి షురూ కానున్న షూటింగ్లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts