టీడీపీకి బిగ్ షాక్ …ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ !

May 26, 2020 at 1:55 pm

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌హానాడు ముహూర్తంగా భారీ షాక్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంద‌నే వార్త‌లు గుప్పుమ‌న్న మ‌ర్నాడే.. అత్యంత కీల‌క‌మైన టీడీపీ నేత‌ల‌ను త‌న చెంత‌కు చేర్చుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ రంగం రెడీ చేసుకున్నారు. అంతేకాదు, బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ఆయ‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ఒక నాయ‌కుడికి, బీసీ వ‌ర్గానికి చెందిన‌ నాయ కుల‌కు వేసిన ఆక‌ర్ష్ మంత్రి ఫ‌లించింది. వారే.. గుంటూరు జిల్లా రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీసీ నే త, వ‌రుస విజయాలు సాధిస్తున్న అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెం దిన ఎమ్మెల్యే ఏలూరిసాంబ‌శివ‌రావు.

నిజానికి వీరిద్ద‌రూ కూడా గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ పార్టీలో నిలిచి గెలి చిన నాయ‌కులు. అంతేకాదు, చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు కూడా. ఇటీవ‌ల కాలంలో అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ అసెంబ్లీలోనూ మంచి గ‌ళం వినిపిస్తున్నారు. ఇక‌, ఏలూరి సాంబ‌శివ‌రావు అయితే, ఉత్త‌మ ఎ మ్మెల్యేగా గుర్తింపు సాధించారు. ఇలా.. ఇద్ద‌రూ కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లోను, పార్టీలోను మంచి గుర్తింపు సాధించారు. అయితే, ఇప్పుడు వైసీపీలోకి రావ‌డం వెనుక వ్యూహం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. నిజానికి చంద్ర‌బాబుకు కీల‌క స‌మ‌యాన్ని చూసి వైసీపీ అధినేత జ‌గ‌న్ దెబ్బ‌కొడుతున్న విష‌యం తెలిసిందే.

ఇప్పుడు మ‌హానాడు వేదిక‌గా.. భారీ ఎత్తున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో బాబుకు భారీ షాక్ ఇచ్చేలా జ‌గ‌న్‌.. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీఅయ్యారు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నారని.. అక్కడే పార్టీలో చేరనున్నారని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. ఇక‌, వీరితో పాటు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన కీల‌క నేత‌లు కూడా పార్టీ మారిపోతార‌ని అంటున్నారు. మొత్తానికి టీడీపీకి భారీ షాక్ త‌ప్పేలా లేద‌ని అంటున్నారు.

టీడీపీకి బిగ్ షాక్ …ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts