ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు!

May 30, 2020 at 3:03 pm

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే తీవ్ర చిక్కుల్లో ఉన్నారు. పార్టీ నుంచి కీల‌క‌మైన ఎమ్మెల్యేలు చేజారుతున్నారు. అదేస‌మ‌యంలో ముఖ్య‌మైన నాయ‌కులు తోట త్రిమూర్తులువంటి వారు కూడా బాబుకు దూర‌మ‌య్యారు. ఈ స‌మ‌యంలో ఎంతో కొంత బాబు స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, బాబు కూడా తెగేదాకా లాగుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు త‌న‌కు తానే చెప్పుకొన్న‌ట్టు స‌హ‌నం, క్ష‌మ ఉంటేనే రాజ‌కీయాలు అని ప్ర‌క‌టించుకు న్నారు. వైసీపీలోకి వెళ్లి.. తిరిగి వ‌చ్చిన వారికి కండువా కూడాఆయ‌న క‌ప్పారు.(దాడి వీర‌భ‌ద్ర‌రావు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌)

ఇలా చేయ‌డం వ‌ల్ల పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని బాబు ఉప‌మానాలు వ‌ల్లించారు. మ‌రి ఇప్పుడు ఇలా చేయ ‌డం లేదు. నిజానికి చంద్ర‌బాబు ఏదైనా స‌మ‌నం, క్ష‌మ వంటివి చూపాల్సి ఉంటే.. ఖ‌చ్చితంగా ఇప్పుడు పార్టీలోని వారిపైనే చూపించాలి. ఎందుకంటే.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఎన్నిక‌లు జ‌రిగిన ఏడాదిలోనే పార్టీ జెండా మోసే నాయ‌కుడు క‌నిపించ‌క‌పోతే.. వ‌చ్చే నాలుగేళ్ల త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి ఏంటి? కానీ, చంద్ర‌బాబు వైఖ‌రిలో మార్పు క‌నిపించ‌డంలేదు. తాజాగా ఇద్ద‌రు టీడీపీ ప‌క్షాన మండ‌లిలో అడుగు పెట్టిన ఎమ్మెల్యేలు పోతుల సునీత‌, శివ‌నాథ‌రెడ్డిల‌పై విజ‌య‌వాడ‌కు చెందిన న‌గ‌ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్నతో ఫిర్యాదు చేయించారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా. విప్‌ను ధిక్కరించి ఆనాడు వైసీపీకి అనుకూలంగా ఈ ఇద్ద‌రు వ్య‌వ‌హ‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. మండ‌లి లో టీడీపీదే పైచేయి అయింది. ఈ రెండు బిల్లుల‌ను త‌న విచ‌క్ష‌ణ మేర‌కు సెల‌క్ట్ క‌మిటీకి పంపుతున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ ప్ర‌క‌టించారు.ఇటీవ‌లే సెల‌క్ట్ క‌మిటీ వేశారా? లేదా? అంటూ హైకోర్టు కూడా ప్ర‌శ్నించిం ది. మొత్తంగా ఈ విష‌యంలో టీడీపీ అనుకున్న‌దే జ‌రుగుతోంది. అయితే, త‌మ విప్‌న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించారంటూ.. సునీత‌, శివ‌నాథ‌రెడ్డిల‌పై బాబు ప‌గ‌బ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బుద్దా వెంక‌న్న‌తో వారిపై ఫిర్యాదులు చేయించారు. విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు ఎందుకు వేయరాదో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు పంపారు. జూన్‌ 3 మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత ఎప్పుడైనా వారిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉందన్న చర్చ జరు గుతోంది. అయితే, ఎలాగూ మండ‌లిలో త‌మ‌దే పైచేయి అయింది కాబ‌ట్టి.. చంద్ర‌బాబు నేత‌ల‌ను దూరం చేసుకోవ‌డం ఎందుక‌నేది కీల‌క ప్ర‌శ్న‌. న‌యానో.. భ‌యానో.. వారికి ఒక వార్నింగ్ ఇచ్చి మ‌ళ్లీ చెంత‌కు తీసుకుంటే.. పార్టీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంటుంది క‌దా! మ‌రి చంద్ర‌బాబు చేస్తున్న‌ది క‌రెక్టేనా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీలోనూ ఇదే చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts