తెలంగాణాలో ఆలయాలు ఓపెన్..? కేసీఆర్ సంచలన నిర్ణయం…!

May 26, 2020 at 3:36 pm

ఇప్పుడు తెలంగాణాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కష్టాల దెబ్బకు ఒక పక్క ఆర్ధిక వ్యవస్థ కూడా కూలిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నా సరే పెద్దగా ప్రయోజనాలు మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. వందల కేసులు రోజుల వ్యవధిలో నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడానికి తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకోవడం షాక్ కి గురి చేస్తుంది.

జూన్‌లో తెలంగాణాలో పలు ప్రముఖ ఆలయాల్లో భక్తుల ప్రవేశానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లినట్టు తెలుస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులు. కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు వ్యూహం సిద్దం చేస్తున్నారు. సినిమా హాల్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అది పక్కన పెడితే ఇప్పుడు ఆలయాలను తెరిచి ఆ తర్వాత మరికొన్ని సడలింపుల దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇక ఏ సడలింపులు వద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని జిల్లాలకు మాత్రం సడలింపులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. షాపింగ్ మాల్స్ ని ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ సహా కొన్ని నగరాల్లో అనుమతించాలి అని సర్కార్ భావిస్తుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. కేసీఆర్ సర్కార్ ఇప్పటికే కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

తెలంగాణాలో ఆలయాలు ఓపెన్..? కేసీఆర్ సంచలన నిర్ణయం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts