ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ ఇంటర్నెట్ ఎంతో తెలుసా…?

May 23, 2020 at 12:22 pm

ఈ రోజుల్లో జనాలకు ఇంటర్నెట్ స్పీడ్ లేకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. అసలే మనకు అన్నీ కూడా వేగంగా జరిగిపోవాలి. ఇలాంటి తరుణంలో నెట్ స్పీడ్ లేకపోతే చేతిలో ఏది ఉంటే నేలకేసి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఎప్పుడు లేని విధంగా ఇంటర్నెట్ స్పీడ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

 

ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పటి వరకు మనం జీబీలలో చూసాం. ఇక ఇప్పుడు వాళ్ళు అత్యంత వేగంగా వచ్చే స్పీడ్ ని తీసుకొచ్చారు. మోనాష్, స్విన్‌బర్న్, ఆర్‌ఎమ్ఐటీ యూనివర్శిటీలు 44.2 టీబీపీఎస్ ఇంటర్నట్ వేగాన్ని అభివృద్ధి చేసారు. సాధించారు. డా. బిల్ కొర్కోరాన్(మొనాష్), ఫ్రొ. ఆర్నన్ మిచెల్(ఆర్‌ఎమ్ఐటీ), డేవిడ్ మాస్(స్విన్‌బర్న్) సారధ్యంలోని బృందం ఈ ఘనతను సాధించడం విశేషం.

 

నెచర్ కమ్యునికేషన్స్ జర్నల్‌లో ఈ స్పీడ్ కి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. లేసర్ సాంకేతికతో నడిచే మైక్రో కాంబ్ అనే నూతన యంత్రం ద్వారా వారు ఈ స్పీడ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మైక్రో కాంబ్ సాయంతో అందుబాటులో ఉన్న వాటి నుంచే ఈ స్పీడ్ మనకు అందుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఈ కామర్స్ సహా సినిమాలకు ఈ వేగ౦ ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది మన దేశంలో తీసుకొస్తారో లేదో తెలియదు గాని ఇది మాత్రం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారిపోయింది ఇప్పుడు.

ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ ఇంటర్నెట్ ఎంతో తెలుసా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts