భార‌త్‌లో ఒక్క రోజులోనే 6,977 కొత్త కేసులు.. ఇరాన్‌ను కూడా దాటేసిందిగా..!!

May 25, 2020 at 10:02 am

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ఈ పేరు వింటేనే భ‌య‌పడిపోతున్నారు. అంత‌లా ఈ మ‌హమ్మారి ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. మొద‌ట చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌.. ప్ర‌స్తుతం అన్ని దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికా అయితే క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడిపోతోంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లోనూ క‌రోనా కేస‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,977 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య‌ 1,38,845కి చేరుకుంది. ఇదే స‌మ‌యంలో 154 మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,021కి చేరుకుంది. అయితే ప్ర‌స్తుతం 77,103 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అలాగే ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 57,720కు చేరింది. ఇక తాజా లెక్క‌ల‌తో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఇరాన్‌ను దాటేసి 10వ స్థానానికి చేరింది. కాగా, మహారాష్ట్రలో రోజు రోజుకూ కొత్త రికార్డులు బద్ధలవుతున్నాయి. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50వేలు దాటేసి… 50231కి చేరింది. నెక్ట్స్ తమిళనాడులో కేసుల సంఖ్య 16277కి చేరింది. ఇక ఆ త‌ర్వాత‌ గుజరాత్‌లో 14056 కేసులొచ్చాయి.

భార‌త్‌లో ఒక్క రోజులోనే 6,977 కొత్త కేసులు.. ఇరాన్‌ను కూడా దాటేసిందిగా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts