ఇక‌పై షాపింగ్ మాల్స్‌లోనూ మ‌ద్యం అమ్మ‌కాలు.. ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

May 25, 2020 at 7:58 am

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను విల‌విల‌లాడిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఇక చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇందులో భార‌త్ కూడా ఒక‌టి. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా అన్నిటితో పాటు మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. దీంతో సామాన్యుల ప‌రిస్థితి ఏమోగాని.. మందుబాబుల ప‌రిస్థితి మాత్రం దారుణంగా మారింది. ఎప్పుడూ కిక్కులో ఉండే మందుబాబులు ఒక్క చుక్క మందు కూడా దొర‌క్క పిచ్చెక్కిపోయారు.

అయితే ఇటీవ‌ల కేంద్రం మ‌ద్యం షాపుల‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో అన్ని రాష్ట్రా‌ల్లోనూ మ‌ద్యం దుకాణాలు తెరుకున్నాయి. దీంతో మ‌ద్యం ప్రియుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక తాజాగా మందుబాబుల‌కు మ‌రో అదిరిపోయే గుడ్ న్యూస్ చెబుతూ.. యోగీ సర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విదేశీ మద్యాన్ని షాపింగ్ మాల్స్‌లో అమ్ముకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఎక్సయిజ్ కమీషన్ అనుమతులు పొందిన నిర్ధారిత బ్రాండ్‌లకు చెందిన విదేశీ మద్యాన్ని మాత్రమే ప్రీమియం రిటైల్ షాపులు అమ్మాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.

దిగుమతి చేసుకున్న విదేశీ లిక్కర్ బ్రాండ్లతో పాటు ఇండియన్-మేడ్ ఫారిన్ లిక్కర్ స్కాచ్, జిన్, వైన్, వోడ్కా, రమ్ బ్రాండ్లన్నింటిని విక్ర‌యించ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, ఇటీవ‌ల కాలంలో అధిక శాతం మంది మాల్స్‌లోనే షాపింగ్ చేయడం ట్రెండ్‌గా మారాడటంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలను అనుమతించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇక‌పై షాపింగ్ మాల్స్‌లోనూ మ‌ద్యం అమ్మ‌కాలు.. ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts