ఉపాసన ఇంట్లో‌ తీవ్ర విషాదం.. శోకసంద్రంలో మునిగిన‌ కుటుంబం

May 27, 2020 at 12:36 pm

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాస‌న తాత‌య్య కామినేని ఉమాప‌తి రావు(92) మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసుకున్న ఉపాసన ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించింది.

ఇందులో భాగంగా.. ‘మా తాత కె.ఉమాపతి రావు-ఐఏఎస్ (జూన్‌ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలోనూ షాయరీలు రాశారు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత’ అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఇక తెలంగాణ‌లోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు.

ప్ర‌స్తుతం ఈయ‌న మ‌ర‌ణం ఉపాస‌న కుటుంబాన్ని శోక‌సంద్రంలో ముంచింది. ఆయ‌న మృతిపై పలువురు నెటిజెన్స్ సంతాపం తెలిపారు. కాగా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన మనందరికీ మెగా పవర్ స్టార్ సతీమణిగానే పరిచయం, కానీ ఆమె అపోలో హాస్పిటల్స్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆమె డిజిటల్ స్పేస్ యూట్యూబ్ వేదికగా హెల్త్ రిలేటెడ్ వీడియోలు చేస్తూ తనదైన గుర్తింపు పొందుతున్నారు. అయితే తాజాగా ఈమె భావోద్వేగంతో పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

ఉపాసన ఇంట్లో‌ తీవ్ర విషాదం.. శోకసంద్రంలో మునిగిన‌ కుటుంబం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts