అప్పుడు అబ్బాయితో.. ఇప్పుడు బాబాయ్‌తో అంటోన్న ఒకప్పటి హీరో!

May 11, 2020 at 9:07 am

నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు. ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన చిత్ర యూనిట్, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు బాలయ్య మరియు బోయపాటి. ఇటీవల వారిద్దరు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఇక దీనికోసం బోయపాటి తన బెస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే బాలయ్య కోసం పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేసిన బోయపాటి, ఈ సినిమాలో అన్ని అంశాలను మిలితం చేస్తున్నాడు. ఇక నటీనటుల పరంగా కూడా భారీ స్థాయిలో వాడనున్నాడట. ఇప్పటికే బాలయ్య కోసం ఇద్దరు కొత్త హీరోయిన్లను లైన్‌లో పెట్టిన బోయపాటి, సినిమాకు ఎవరు సెట్ అవుతారో వారిని ఫైనల్ చేయనున్నాడట. కాగా ఈ సినిమాలో మాజీ హీరో వేణు తొట్టంపూడి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో బోయపాటి తెరకెక్కించిన దమ్ము చిత్రంలో తారక్ హీరోగా నటించగా వేణు ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా అదే తరహా పాత్రలో నటించేందుకు వేణు రెడీ అవుతున్నాడు. అప్పుడు అబ్బాయితో నటించిన వేణు ఇప్పుడు బాబాయ్‌తో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందా అనే ఆసక్తి నందమూరి ఫ్యాన్స్‌లో నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

అప్పుడు అబ్బాయితో.. ఇప్పుడు బాబాయ్‌తో అంటోన్న ఒకప్పటి హీరో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts