నెంబర్లు సేవ్ చేసేందుకు.. వాట్సాప్‌లో మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్..!!

May 23, 2020 at 3:56 pm

వాట్సాప్‌.. నేటి త‌రంలో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను కూడా యూజ్ చేస్తున్నారు. పొద్దున లేచింది మొద‌లు గుడ్‌మార్నింగ్‌తో మొద‌లు పెట్టి.. రాత్రి గుడ్‌నైట్ చెప్పే వ‌ర‌కు వాట్సాప్‌ను తెగ వినియోగిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే వాట్సాప్ యూజ‌ర్స్ కోట్ల‌లో పెరిగారు. ఇక వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తూ.. యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. అయితే తాజాగా యూజ‌ర్ల సౌకర్యార్థం మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే కేవలం ఓ క్యూర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది.

వాస్త‌వానికి ఇప్పటివరకు కాంటాక్టు లిస్టుకు నెంబర్లు ఫీడ్ చేయాలంటే, కీప్యాడ్ ఓపెన్ చేసి నెంబరు టైప్ చేసి, పేరు టైప్ చేసి ఆపై సేవ్ చేయాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఫోన్ నెంబర్లు తప్పుగా టైప్ చేయడమో, లేక పేర్లు తప్పుగా టైప్ చేయడమో జరుగుతుంటాయి. ఇక ఒక్కోసారి భారీ సంఖ్యలో ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే మ‌రింత క‌ష్టం అవుతుంది.

ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ అద్భుత‌మైన ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. సెట్టింగ్స్ లో కొత్తగా క్యూఆర్ కోడ్ ఆప్షన్ రానుంది. ప్రతి వాట్సాప్ వినియోగదారుడికి ఓ క్యూర్ కోడ్ కేటాయిస్తారు. ఓ వ్యక్తి ఫోన్ నెంబరు సేవ్ చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఫోన్ లోని క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ తో స్కాన్ చేస్తే సరి. అతడి పేరు, నెంబరు ఆటోమేటిగ్గా సేవ్ అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో ఉంది. అతి త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానున్న‌ట్టు తెలుస్తోంది.

నెంబర్లు సేవ్ చేసేందుకు.. వాట్సాప్‌లో మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts