భర్తను ఊరు వెళ్లొద్దని, టైర్ కింద పడి చనిపోయిన భార్య…!

May 23, 2020 at 7:28 pm

సుమారు ఏడాది తర్వాత భర్త ఊరు వచ్చాడు. అప్పుడప్పుడు వచ్చే వాడు గాని ఈ సారి మాత్రం ఏడాది తర్వాత వచ్చాడు. భార్య ఎంతో సంతోషించింది. డబ్బు సంపాదన కోసం వెళ్ళాడు అతను. ఎక్కడో ముంబై లో ఉంటున్నాడు. ఇప్పుడు లాక్ డౌన్… ముంబై లో చాలా మంది వలస కూలీలు ఉండిపోయారు. అతను ఏమో అక్కడ బస్ నడుపుతున్నాడు. వారిని అందరిని సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళాలి.

ఆ గ్రామం ఎక్కడ అంటే… జార్ఖండ్‌లోని విష్ణుగఢ్‌ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని సారుకుదార్. భర్త వారు అందరిని తీసుకొచ్చి మళ్ళీ ముంబై వెళ్తాను అన్నాడు. కాని అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ భయంతో అక్కడికి వెళ్ళకుండా ఆపాలి అని చూసింది. అతని పేరు వాసుదేవ్ మహ‌తో… భార్య వద్దని చెప్పినా సరే తనకు ముంబై వెళ్ళడం చాలా అవసరం అని వెళ్ళకపోతే కుదరదు అని ఆమె నచ్చజెప్పాడు. అయినా సరే ఆమె ఎంత మాత్రం వినలేదు.

ఈ నేపధ్యంలో ఇద్దరి మధ్య గొడవ కూడా అయింది. అయితే నేను వెళ్ళిపోతా అంటూ భర్త డ్రైవర్ సీట్ లో కూర్చుని బస్ స్టార్ట్ చేసాడు. బస్ కింద నిలబడి భార్య అతనిని ఆపాలి అని ప్రయత్నం చేసింది. ఈ తరుణంలో కాలు జారిపోవడంతో బస్ చక్రాల కింద పడింది. చూసుకోని భర్త బస్  ని ముందుకి తీసుకుని వెళ్ళడం తో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

భర్తను ఊరు వెళ్లొద్దని, టైర్ కింద పడి చనిపోయిన భార్య…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts