వైసీపీకి వడ్డీతో ఇస్తాం, వదిలే ప్రసక్తే లేదు: చంద్రబాబు

May 28, 2020 at 3:30 pm

రెండో రోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు అందరూ కూడా ప్రసంగించి తమ విలువైన అభిప్రాయాలను చెప్పారు. ఇక ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

 

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న తటస్థులపై కేసులు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసారు. స్థానిక ఎన్నికల నామినేషన్లలో పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసారు. ఎన్టీఆర్ జీవితం అందరికి ఆదర్శం అని ఆయన ఆశయాలను అందరూ కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్నారు.

 

మేం అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వైసీపీ అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన కాస్త తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేసారు. జిల్లాల్లో పర్యటించాలంటే సీఎం జగన్‌ అనుమతి కావాలా? అని ఆయన నిలదీశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచనలు చేసారు. దాడులు, దోపిడీలకు సీఎం సలహాదారు వ్యూహ రచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులు కష్టాల్లో ఉన్నారని ఈ సందర్భంగా వారిని ఆదుకోవాలి అని చంద్రబాబు నాయుడు కోరారు. రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు.

వైసీపీకి వడ్డీతో ఇస్తాం, వదిలే ప్రసక్తే లేదు: చంద్రబాబు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts