ఏడాది పాల‌న‌లో సీఎం జ‌గ‌న్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవే..!!

May 30, 2020 at 10:27 am

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్ ప్రారంభమై నేటితో ఏడాది అయ్యింది. మే 30న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అశేష అభిమానుల మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ.. సీఎం పీఠాన్ని అధిరోహించిన జ‌గ‌న్ ముప్పై ఏళ్లపాటు అధికారంలో ఉండటమే తన లక్ష్యమన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలనకు కైవం చేసుకుంది. 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లను సాధించి తిరుగులేని ప్రజాబలంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేప‌ట్టారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త, కొత్త పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారు. మేనిఫెస్టోను అమలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకున్న జగన్.. ఒక్క ఏడాదిలోనే 90శాతం హామీలను నెరవేర్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మ‌రి ఈ ఏడాది పాల‌న‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ పథకాలు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం..

– పేద విద్యార్థుల కోసం జగనన్న అమ్మ ఒడి.
– పేద వారికి వైద్యం అందించే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ.
– ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా గ్రామ/ వార్డు సచివాలయాలు.
– రైతన్నను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా.
– పేదలందరికీ ఇళ్లు ఇచ్చే క్రమంలో వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ.
– పొదుపు సంఘాల మహిళల కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.
– పేద విద్యార్థులకు భోజనం, వసతి కల్పించేలా జగనన్న వసతి దీవెన.
– దశలవారీగా మద్యం నియంత్రణ.
– 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం.
– ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం.
– పోలీసులకు వీక్లీ ఆఫ్‌.
– మత్య్సకారుల కోసం వైఎస్సార్ మత్య్సకార భరోసా.
– స్పందన కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారం.
– పెట్టుబడుల పెట్టే వారి కోసం వైఎస్సార్ నవోదయం.
– రాష్ట్రంలో సీబీఐకి అనుమతి.
– వృద్ధులు, వికలాంగులకు వైఎస్సార్ పెన్షన్ కానుక.
– మహిళల రక్షణ కోసం దిశ చట్టం.
– విద్యార్థుల కోసం నాడు నేడు.
– మహిళలకు 50 శాతం రిజర్వేషన్.
– ప్రాజెక్ట్‌ల్లో రివర్స్ టెండరింగ్.
– దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పన.
– సంక్షేమ పథకాల నిర్వహణ కోసం జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లు.
– అర్చకులు,ఇమామ్ లు, పాస్టర్లకు రూ.5వేల ఆర్థిక సాయం.

ఏడాది పాల‌న‌లో సీఎం జ‌గ‌న్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts