అన్నాద‌మ్ముల భూ త‌గాదా ఎంత దూరం వెళ్ళిందంటే?

June 26, 2020 at 9:33 pm

తూర్పుగోదావరి జిల్లాలో సినిమా థ్రిల్లర్ ను మరిపించే విధంగా ఒక హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఓ భూమి తగాదాల విషయంలో తమ్ముడిని చంపేందుకు ఓ అన్న అమ్మాయిని ఎరగా వేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే… ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండలం చయ్యారు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుంది. మృతుడు రామకృష్ణ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీనివాస ప్రసాద్, రామకృష్ణ వరుసకు అన్నదమ్ములవుతారు. వీరి మధ్య కొంతకాలంగా భూముల హద్దుల విషయంలో గొడవలు నడుస్తున్నాయి.

పంచాయితీలో శ్రీనివాస్ ను రామకృష్ణ అవమానించడంతో పగతో రగిలిపోయిన అన్న.. రామకృష్ణను ఎలాగైనా హత్య చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఒక అమ్మాయిని ఎరగా వేయించాడు. ఆమెతో ఫోన్ చేయించి కాకినాడకి పిలిపించి ఒక పథకం ప్రకారం హత్య చేసి సమీపంలో ఉన్న కాలవలో పడేశాడు. విషయం తమకి ఏమీ తెలియదు అన్నట్లుగానే రామకృష్ణ హత్యకు ఎరగా ఉంచిన అమ్మాయితో రామకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు. తాను రామకృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నామని తమ కోసం వెతకొద్దని రామకృష్ణ తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు. ఈ విషయం పై రామకృష్ణ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన కరోనా కారణంగా పెద్దగా పట్టించుకోలేదు. డిసెంబర్ ఎనిమిదో తేదీ నుండి రామకృష్ణ కనిపించడం లేదని మృతుడి అన్న హై కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అన్నాద‌మ్ముల భూ త‌గాదా ఎంత దూరం వెళ్ళిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts