ఆచార్య ప‌రిస్థితేంటి?

June 30, 2020 at 9:25 pm

ఇండస్ట్రీలో ఎవ్వరి నోటా విన్నా ఇదే మాట! మెగాస్టార్  చిరంజీవి సినిమా ‘ఆచార్య’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా వైరస్ తీవ్రత వల్ల టాలీవుడ్ లో సినిమా షూటింగ్‌లు ప్రారంభం కాలేదు. ఫలితంగా సెప్టెంబర్‌లో, నవంబర్‌లోనో విడుదలవుతాయనుకున్న చిత్రాలు కూడా వాయిదా పడుతున్నాయి.

చిరంజీవి చిత్రం ‘ఆచార్య’ జులై నుంచైనా షూటింగ్‌ ప్రారంభం అయితే  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది.   కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. అందువల్ల ఈ  ‘ఆచార్య’ చిత్రం సంక్రాంతికి కూడా వచ్చే అవకాశం లేదు. ఈ సినిమా   ఇప్పటి వరకూ కేవలం 50 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్‌ ఇంకా  షూటింగ్‌లోనే జాయిన్‌ కాలేదు.  కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2021మార్చిలో  ‘ఆచార్య’ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అయ్యో.. ‘ఆచార్య’!? అనకుండా ఉండగలమా!?

ఆచార్య ప‌రిస్థితేంటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts