ఆన్‌లైన్ క్లాసుల్లో క్లారిటీ ఉందా… గంద‌ర‌గోళంలో పిల్ల‌లు?

June 29, 2020 at 8:58 am

కరోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి ఎలా విజృంభిస్తుందో తెలిసిన విష‌య‌మే. దీంతో పిల్ల‌ల చ‌దువుకి కూడా బ్రేక్ ప‌డింది. కారణంగా రాష్ట్రంలో 2020–21 అకడమిక్ ఇయర్ ను అధికారికంగా ప్రారంభించ లేదు. కాబట్టి ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ గానీ, ఆఫ్ లైన్లో గానీ క్లాసులు నిర్వహించొద్దు. పేరెంట్స్ ను ఫీజులు కూడా అడగొద్దు.. ఇదీ జిల్లాల్లో డీఈఓలు ఇచ్చిన ప్రకటన.

ప్రభుత్వ పెద్దలు గానీ, విద్యాశాఖ అధికారులు గానీ ఆన్ లైన్ క్లాసులు నడపొద్దంటూ ఆర్డర్స్ గానీ, మెమోలు గానీ ఇవ్వలేదు. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించండి.. ఇదీ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం ప్రకటన.

రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులపై గందరగోళం నెలకొంది. క్లాసులు నిర్వహించవద్దని జిల్లాల్లో డీఈవోలు ప్రకటనలు ఇస్తుంటే.. ప్రైవేటు స్కూల్ యాజ‌మాన్యం మాత్రం పెడ‌చెవిన పెడుతున్నారు. క్లాసులు య‌దావిధిగానే కొనసాగుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ ఇందుకోసం పేరెంట్స్ నుంచి అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సర్కారు మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. స్టేట్లో మొత్తం 10,700 వరకూ ప్రైవేటు స్కూల్స్ ఉండగా, వాటిలో 30 లక్షల మంది వరకూ స్టూడెంట్స్ చదువుతున్నారు. వాస్తవానికి జూన్ 12 నుంచి 2020–21 అకడమిక్ ఇయర్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఇంకా అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించ లేదు. ఆగస్టు 15 తర్వాతే విద్యా సంవత్సరం ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, స్టేట్ గవర్నమెంట్ కూడా అదే ఆలోచనలో ఉంది.

విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోయినా, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లోని చాలా స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. తమ స్కూల్ పిల్లలు వేరే స్కూళ్లకు వెళ్ళిపోతార‌నే భ‌యంతో ముందుగానే ఫీజులు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌నే భావ‌న‌తో ఆన‌లైన్ మీద ప‌డ్డారు. ఫీజులూ వసూలు చేసుకోవచ్చని మేనేజ్మెంట్లు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎల్ కేజీ పిల్లలకు కూడా క్లాసులు ప్రారంభించారంటే, మేనేజ్మెంట్ల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ క్లాసులు వినాలంటే తప్పనిసరిగా ఫీజులు చెల్లించాలని పేరెంట్స్ పై ఒత్తిడి తెస్తున్నాయి. లేకపోతే పిల్లలు వెనుకబడతారని భయపెడుతున్నాయి. కరోనా సంక్షోభం వల్ల ఫీజులు కట్టడం ఇబ్బందిగా ఉందని పేరెంట్స్ చెప్తున్నా, మేనేజ్మెంట్లు వినిపించుకోవడం లేదు. పేరెంట్స్ స్కూల్స్‌కి రావాల్సిన అవసరం లేదనీ, డిజిటల్ పద్దతుల్లో అకౌంట్ కు గానీ, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా గానీ ఫీజులు చెల్లించాలని చెప్తున్నాయి. దీంతో పిల్లల భవిష్యత్ కోసం కొందరు పేరెంట్స్ అప్పులు తెచ్చి మరీ ఫీజులు కడుతున్న వైనం క‌నిపిస్తోంది. కొన్ని చోట్ల స్కూల్స్ ముందు పేరెంట్స్ ఆందోళనలు కూడా చేస్తున్నారు. లాక్ డౌన్‌ టైంలో ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని కోరుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 90 శాతం పేరెంట్స్ ఆన్ లైన్ క్లాసులు వద్దనే చెప్తున్నారు. క్లాసులకు ఫీజులు కట్టడం ఒక ఇబ్బంది కాగా, ల్యాప్ టాప్లు, స్మార్ట్ ఫోన్లు లేకపోవడమూ మరో కారణం అంటున్నారు.

ఆన్‌లైన్ క్లాసుల్లో క్లారిటీ ఉందా… గంద‌ర‌గోళంలో పిల్ల‌లు?
0 votes, 0.00 avg. rating (0% score)