ఇంట‌ర్ చ‌దివారా…అయితే అమెజాన్‌లో గుడ్ ఆఫ‌ర్‌

June 29, 2020 at 7:37 am

ప్ర‌స్తుతం చాలా మంది నిరుద్యోగంతో ఇబ్బందులు ప‌డుతున్నారు. వారి కోసం అమెజాన్ ఒక మంచి ఆఫ‌ర్‌ని ప్ర‌క‌టించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ సర్వీస్ విభాగంలో 20వేల టెంపరరీగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ అమెజాన్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ ప్రభు మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగిపోతున్నాయని, కష్టమర్లకు సర్వీస్ లను అందించేందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. భాషతో సంబంధం లేకుండా లోకల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యం ఉండాల‌ని అన్నారు. అభ్య‌ర్థుల ప‌నితీరు, కంపెనీ అవ‌స‌రాల‌ ఆధారంగా తాత్కాలిక ఉద్యోగాల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న మార్చుతామ‌ని చెప్పారు. ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవాలని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ ప్రభు తెలిపారు.

ఇంట‌ర్ చ‌దివారా…అయితే అమెజాన్‌లో గుడ్ ఆఫ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)